త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | సింగ‌ర్‌గా మారిన హీరోయిన్ రాశీఖ‌న్నా – శివుడిపై భ‌క్తి పాట – నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

మ‌హాశివ‌రాత్రి రోజు శివుడిపై త‌న‌కున్న భ‌క్తిని పాట రూపంలో చాటుకుంది రాశీఖ‌న్నా. సింగ‌ర్‌గా మారి శివ్ కైలాషోం కే వాసి అనే పాట‌ను పాడింది. ఈ సాంగ్‌లో రాశీఖ‌న్నా న‌టించింది. ఆదివారం రిలీజైన ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Feb 15, 2026, 9.45 pm IST

Raashi Khanna | సింగ‌ర్‌గా మారిన హీరోయిన్ రాశీఖ‌న్నా – శివుడిపై భ‌క్తి పాట – నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు
Advertisement

Raashi Khanna | మ‌హాశివ‌రాత్రి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది రాశీఖ‌న్నా. శివుడిపై త‌న‌కున్న భ‌క్తిని పాట రూపంలో చాటుకుంది. సింగ‌ర్‌గా మారిన రాశీఖ‌న్నా శివ్ కైలాషోం కే వాసి అనే పాట‌ను పాడింది. శివ‌త‌త్వాన్ని చాటిచెప్పే ఈ పాట‌లో రాశీఖ‌న్నా స్వ‌యంగా న‌టించింది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఆదివారం తాను పాడిన పాట‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. రాశీఖ‌న్నా పాడిన ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

భ‌క్తిని చాటేలా...

‘శివ్ కైలాషోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడంతో అంతరంగాన్ని మేల్కొల్పుతూ.... అతీంద్రియత శక్తి అయిన అయిన మహా దేవుడి మీద భక్తిని చాటేలా ఉంటుంద‌ని రాశీఖ‌న్నా అన్న‌ది. విశిష్టమైన మ‌హాశివ‌రాత్రి రోజున పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంద‌ని తెలిపింది. రాశీఖ‌న్నా స్వ‌రం, పాట‌లో ఆమె కనిపించిన తీరు, పలికించిన భావోద్వేగాలు అభిమానుల‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు సోహ‌మ్ సుత‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్ప‌ర్శ్‌, జెహీష్‌, త‌నిష్క్ సేథ్‌, వ్యాంపైర్ మ్యూజిక్ క‌లిసి సంగీతం అందించారు. వేదాన్ష్ శ‌శ్వాత్ మిశ్రా మ్యూజిక్ సూప‌ర్‌విజ‌న్ అందించాడు. రాశీఖ‌న్నా సింగ‌ర్‌గా మార‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. గ‌తంలో ప‌లు జోరు, జ‌వాన్‌, ప్ర‌తిరోజు పండ‌గేతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో పాట‌లు పాడింది.

సినిమాలు...సిరీస్‌లు...

సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్‌లో అక్ష‌య్ కుమార్ కు జోడీగా రాశీఖ‌న్నా న‌టిస్తోంది. తెలుగులో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన‌ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ మూవీకి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ‘ఫర్జీ 2’, విక్రాంత్ మాస్సేతో కలిసి ‘తలఖోన్ మే ఏక్’, ఆర్. మాధవన్‌తో కలిసి ‘థ్రిల్లర్ బ్రిడ్తోజ్ అనే వెబ్ సిరీస్‌లు చేస్తోంది.

 

Advertisement
Advertisement