త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET | నీట్ లీకేజీ కార‌కుల‌ను శిక్షించేంత వ‌ర‌కు పోరాడుతాం : వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు

NEET | నీట్ పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. చనిపోయిన విద్యా ర్థుల ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, నీట్ పేపర్ లీకేజీ కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 24, 2026, 1.29 pm IST

NEET | నీట్ లీకేజీ కార‌కుల‌ను శిక్షించేంత వ‌ర‌కు పోరాడుతాం : వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు
Advertisement

NEET | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. చనిపోయిన విద్యా ర్థుల ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, నీట్ పేపర్ లీకేజీ కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థి యువతపై పోలీసుల దాడులను ఖండిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐపీఎస్‌యూ, ఏఐఎస్‌బీ సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్ విజయవంతం అయింది. హైదరాబాద్ నగరంలో నారాయణగూడలో పలు కళాశాలలో బంద్ చేయించి నారాయణగూడ చౌరస్తా నుండి వై జంక్షన్ వరకు విద్యార్థి మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ), అనిల్(పీడీఎస్‌యూ), నాగరాజు, మహేష్(పీడీఎస్‌యూ), గడ్డం నాగార్జున, మురళి (ఏఐఎఫ్ డీఎస్), హకీమ్ నవీద్ (ఏఐఎస్‌బీ), గోపాల్(ఏఐపీఎస్‌యూ), వలీ ఉల్ల ఖాద్రి(ఏఐవైఎఫ్), కోట రమేష్, వెంకటేష్(డివైఎఫ్ఐ) మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వెనుక ఉన్న పెద్ద తలకాయలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ధర్మేంద్ర పధాన్‌ను బ‌ర్తరఫ్ చేయకుండా మోడీ విద్యార్థి యువకులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నార‌ని మండిపడ్డారు. జాతీయస్థాయిలో పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి యువకులపై లాఠీ చార్జీలు, భాష్ప‌ వాయువులు ఉపయోగించి దాడులు చేయ‌డం స‌రికాద‌న్నారు. నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను రద్దు చేయకుండా, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యాసంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశాయని ఈ ఉద్యమాన్ని తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రెహమాన్, అశోక్ రెడ్డి, శ్రీకాంత్, జావేద్ ,చైతన్య యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement