త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Advocate Dundu Manmohan | దుండు మన్మోహన్‌కు సీనియ‌ర్‌ అడ్వకేట్ హోదా.. ఉత్త‌ర్వులు జారీ చేసిన హైకోర్టు

Advocate Dundu Manmohan | తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ దుండు మన్మోహన్ కు "డెజిగ్నేటెడ్ సీనియర్" హోదా ల‌భించింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Sep 24, 2026, 4.45 pm IST

Advocate Dundu Manmohan | దుండు మన్మోహన్‌కు సీనియ‌ర్‌ అడ్వకేట్ హోదా.. ఉత్త‌ర్వులు జారీ చేసిన హైకోర్టు
Advertisement

Advocate Dundu Manmohan | త్రినేత్ర న్యూస్: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ దుండు మన్మోహన్ కు "డెజిగ్నేటెడ్ సీనియర్" హోదా ల‌భించింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా న్యాయవాదులు ఉంటే 150 మంది వరకు సీనియర్ హోదాను హైకోర్టు కల్పించింది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ లో, విశాఖపట్నంలో ఇన్‌క‌మ్‌ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కార్యాలయాల నిర్మాణంలో మన్మోహన్ క్రియాశీలకంగా వ్యవహరించారు.

1981లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన మన్మోహన్ 1993లో ఇన్‌క‌మ్‌ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు జ్యూడీషియల్ మెంబర్‌గా ఎంపిక‌య్యారు. కలకత్తా జోన్ లో జాయిన్ అయ్యిన వీరు బాంబే, హైదరాబాద్, విశాఖ లలో పనిచేశారు. 2008లో ఇన్‌కం టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులై చండీగర్, లక్నో, ముంబ‌యి, హైదరాబాద్ లతో పాటు 2018 వరకు దేశంలోని అన్ని జోన్లలో పని చేసిన అరుదైన అవకాశం పొందారు. వృత్తి పరంగా నిజాయితీ, ముక్కు సూటితత్వం ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు.

యూనివ‌ర్సిటీ ఫ‌స్ట్ ర్యాంక‌ర్‌గా..

ఇన్‌క‌మ్‌ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ వైస్ చైర్మన్ గా మన్మోహన్ రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించారు. పలు విభాగాల కేసులతోపాటు ప్రత్యేకంగా ఇన్‌క‌మ్‌ టాక్స్ కేసులలో నిష్ణాతులైన మన్మోహన్ విశాఖపట్నంకు చెందిన రైల్వే సీనియర్ మాజీ ఉద్యోగి దుండు జగన్నాధరావు, రత్నం దంపతుల కుమారుడు. బీఎల్, ఎం.కామ్. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ లో పూర్తి చేశారు. బాంబే యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎం. చేసిన వీరు, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు.

మన్మోహన్ తో పాటు మంత్రి రామారావు, ఏకే జయ ప్రకాష్ రావు, ఎం రాజేందర్ రెడ్డి, ఏర బాటి రామారావు, కల్పన, ఏ ప్రభాకర్ రావు, వై రత్నాకర్, కే రాఘవాచార్యులు, జీవి ప్రసాద్, ఈ ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్ వెలగపూడి, డాక్టర్ జుట్టు కొండ విజయలక్ష్మి, చెట్లూరు శ్రీనివాస్, వీవీఎస్ఎన్ రాజు, టీఎస్ రాజశేఖర్, రమేష్ బాబు విశ్వనాథుల, థామస్ జార్జ్, చిక్కుడు ప్రభాకర్, పి విష్ణువర్ధన్ రెడ్డి, వివేక్ జైన్ లు "సీనియర్" అడ్వకేట్ హోదా పొందిన వారిలో ఉన్నారు. సెప్టెంబర్ 16న తెలంగాణ ఫుల్ కోర్ట్ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు వీరికి ఈ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచి వీరి హోదా అమల్లోకి వచ్చింది.

Advertisement
Advertisement