Enugula Rakesh Reddy | రెండు డీఏలు ఇస్తామని ఉద్యోగులను అవమానించారు
Enugula Rakesh Reddy | ఉద్యోగులకు దసరా సందర్భంగా 2 డీఏలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారిని అవమానించిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు.
- వాళ్లేమైనా ఫ్యూచర్ సిటీలో వాటా అడిగారా? మూసీ కాంట్రాక్టు అడిగారా?
- ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇవ్వాలని చూస్తున్నరు
- ఆరు డీఏలు వెంటనే చెల్లించాలి
- బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్
Enugula Rakesh Reddy | త్రినేత్ర న్యూస్: ఉద్యోగులకు దసరా సందర్భంగా 2 డీఏలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారిని అవమానించిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. వాళ్లేమైనా ఫ్యూచర్ సిటీలో వాటా అడిగారా? మూసీ కాంట్రాక్టు అడిగారా అని ప్రశ్నించారు. వెంటనే ఆరు డీఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీపీఎస్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో, దాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలన్నారు.
ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయి ఆందోళనకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను బెదిరించే ప్రయత్నం చేసింది. తమ డిమాండ్ల కోసం ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కూరగాయల బేరం మాదిరిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రానికి భారంగా మారారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒకేరోజు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగులను కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పరిపాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి ఎందుకు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో పీఆర్సీ 1100 రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది. కేసీఆర్ హయాంలో ఉద్యోగుల జీతాలకు 38 శాతం వెచ్చించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉద్యోగుల జీతాలకు 28 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు.
కమిటీల ప్రభుత్వంగా మారింది..
ఓపీఎస్‌ను రద్దు చేసి సీపీఎస్‌ను తీసుకువస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల ప్రభుత్వంగా మారింది. బీఆర్ఎస్ నేతలపై సిట్ ఉద్యోగుల డిమాండ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంప్లాయి హెల్త్ స్కీం అమలు చేయడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను పౌరుల్లాగా చూడటం లేదు.
డిప్యూటీ సీఎం సతీమణి కమీషన్ అడిగారని ఒక రిటైర్డ్ ఎంప్లాయి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీ టూర్లు, మనుమడి ఫుట్ బాల్ మ్యాచ్ ల కోసం, అందాల పోటీలకు పైసలు వస్తాయి. కానీ ఉద్యోగులకు ఇవ్వడానికి ఉండవు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. రెండు పీఆర్సీలు కలిపి 73 శాతం ఫిట్‌మెంట్ కేసీఆర్ ఇచ్చారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు కేసీఆర్ ప్రభుత్వం జీతాలు పెంచింది. ఆరు డీఏలు వెంటనే రిలీజ్ చేయాలి అని రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం
సెప్టెంబర్ 24, 2026

Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలచే కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
సెప్టెంబర్ 24, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం
- ●Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలచే కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..
- ●Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా నేషనల్ క్రష్
- ●Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే
- ●Harish Rao | రాహుల్జీ.. మిగతా వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును కోరండి

Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం

Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలచే కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి

Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..

Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా నేషనల్ క్రష్



