DGP Anand | బాధిత పోలీసు కుటుంబాలకు డీజీపీ అండ.. ఒక్కో కుటుంబానికి కోటి చొప్పున చెక్కుల అందజేత
DGP Anand | విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అండగా నిలిచారు.
DGP Anand | త్రినేత్ర.న్యూస్: విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్లను సోమవారం డీజీపీ కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు కుటుంబాల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి..
శంకర్‌పల్లి పరిధిలో 2025, ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెలిమడ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముత్తంగి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన తండ్రి ముత్తంగి యాదయ్యకు సి.వి. ఆనంద్ రూ.కోటి బీమా చెక్కును అందజేశారు.
మరో ఇద్దరు సిబ్బందికి..
నల్లగొండ జిల్లా కనగల్‌లో పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు 2025, జూన్ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మరో పోలీసు కానిస్టేబుల్ కె.వెంకటరెడ్డి 2026, మార్చి 10న లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వెంకట్ రెడ్డి వరంగల్‌లోని ఏఆర్పీసీగా హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తుండగా వెనుక నుంచి లారీ తాకడంతో మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో చనిపోయిన వారికి ఎస్బీఐలో ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండటం వల్ల బ్యాంక్ అధికారులతో డీజీపీ సంప్రదించి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఎస్‌బీఐ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్




