త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం

Vemulawada | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. చేపట్టిన ప్రతి పనికి నిర్దిష్ట గడువు విధించి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

P

Telangana | Published On Nov 14, 2026, 6.56 pm IST

Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం
Advertisement

Vemulawada | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. చేపట్టిన ప్రతి పనికి నిర్దిష్ట గడువు విధించి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. పనుల పురోగతికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని స్పష్టం చేశారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై శనివారం భీమేశ్వర స్వామి ఆలయ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.

ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణాల నాణ్యత, ఇతర అంశాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి పనికి ప్రత్యేకంగా గడువు ఖరారు చేసి, ఆ మేరకు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా అవసరమైన మేరకు కార్మికులను పెంచాలని, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, స్థపతులు జయేంద్రన్, గణేశ్‌, స్ట్రక్చర్ ఇంజినీర్ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement