త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ఓట్ల తొల‌గింపుపై స‌మాధానం చెప్పాలి : డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | స‌ర్ ప్ర‌క్రియ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘంపై ప్ర‌జ‌ల్లో అనేక అనుమానాలు ఉన్నాయ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఓట్ల తొల‌గింపుపై ఎన్నిక‌ల సంఘం పార‌ద‌ర్శ‌కంగా స‌మాధానం చెప్పాలన్నారు. వేలాది ఓట్ల తొల‌గింపు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని భ‌ట్టి పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 30, 2026, 3.15 pm IST

Bhatti Vikramarka | ఓట్ల తొల‌గింపుపై స‌మాధానం చెప్పాలి : డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

త్రినేత్ర న్యూస్ : స‌ర్ ప్ర‌క్రియ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘంపై ప్ర‌జ‌ల్లో అనేక అనుమానాలు ఉన్నాయ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఓట్ల తొల‌గింపుపై ఎన్నిక‌ల సంఘం పార‌ద‌ర్శ‌కంగా స‌మాధానం చెప్పాలన్నారు. వేలాది ఓట్ల తొల‌గింపు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని భ‌ట్టి పేర్కొన్నారు. కొచ్చిలో ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌’లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ‎ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత. ‎ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలి. ‎ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిపై ప్రజల్లో అనుమానాలున్నాయి. స‌ర్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలి. ‎ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు తొలగించడం ఈసీ బాధ్యత. ‎బ్యాలెట్‌ పేపర్‌పై ప్రజల్లో ఉన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. ‎రాజకీయ పార్టీలు గెలవొచ్చు.. ఓడిపోవచ్చు.. వ్యవస్థపై ప్రజల నమ్మకం ముఖ్యం అని భ‌ట్టి పేర్కొన్నారు.

తెలంగాణ సంక్షేమ పథకాలను ‘ఫ్రీబీస్‌’గా చూడొద్దు
‎

‎తెలంగాణ సంక్షేమ పథకాలను ‘ఫ్రీబీస్‌’గా చూడొద్దు. ‎సంక్షేమ పథకాలు మానవ వనరులపై పెట్టుబడులు. ‎ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలు చేస్తున్నాం. ‎తొలిదశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాం. మరో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు. ‎ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ‎మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉంది. ‎200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి. ‎పేదలకు ఇళ్లు, విద్య, ఆరోగ్యం అందించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం. ‎మంచి విద్యతో నాణ్యమైన మానవ వనరులను తయారు చేయవచ్చు అని భ‌ట్టి తెలిపారు.

రాష్ట్రాల మధ్య పోటీ ఆరోగ్యకరమైనదే

‎దక్షిణాది రాష్ట్రాలకు సమాఖ్య స్ఫూర్తితో న్యాయం చేయాలి. ‎రాష్ట్రాలు దేశానికి అందిస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ‎జీఎస్‌టీ సమావేశాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల అంశాన్ని ప్రస్తావించాను. ‎రాష్ట్రాల మధ్య పోటీ ఆరోగ్యకరమైనదే. ‎ఒకరితో ఒకరు పోటీపడి రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలి. ‎అభివృద్ధికి ఎక్కువగా సహకరిస్తున్న రాష్ట్రాలను దెబ్బతీయకూడదు అని డిప్యూటీ సీఎం సూచించారు.
‎

హైటెక్‌ సిటీ తెలంగాణకు బలం

‎హైదరాబాద్‌లో భారీ టాలెంట్‌ పూల్‌ యువత ఉంది. ‎ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల సాంకేతిక విద్యకు ప్రోత్సాహం. ‎పెట్టుబడులకు హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి మౌలిక వసతులు. ‎ఓఆర్‌ఆర్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్‌ సిటీ, హైటెక్‌ సిటీ తెలంగాణకు బలం అని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

‎‎రేవంత్‌రెడ్డితో 100 శాతం సఖ్యతతో కలిసి పనిచేస్తున్నా

‎వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‎వైఎస్సార్‌ మార్గనిర్దేశం కాంగ్రెస్‌ సిద్ధాంతాలపై నా నమ్మకాన్ని బలపరిచింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను వీడిన పాత నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలి. ‎తిరిగి కాంగ్రెస్‌లో చేరి దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దాం. ‎రేవంత్‌రెడ్డితో 100 శాతం సఖ్యతతో కలిసి పనిచేస్తున్నాం. ‎మేమంతా చర్చించుకుని, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ‎రాష్ట్రంలో కాంగ్రెస్‌ సిద్ధాంతాల అమలే మా లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement