TGDEECET | ఇక వాట్సాప్‌కే డీఈఈ సెట్ హాల్ టికెట్లు.. రేపటి నుంచే సేవలు షురూ..!
TGDEECET | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరో కీలక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈ సెట్) హాల్ టికెట్లను ఇకపై మీసేవ వాట్సాప్, చాట్‌బాట్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ సేవలు శుక్రవారం (మే15) ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఇంటి వద్ద నుంచే తమ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వీలుకలుగనుంది. ఈ నెల 21, 22 తేదీల్లో డీఈఈసెట్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎంతో మరింత సౌకర్యంగా మారనుంది.
ఇక హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ముందు మీసేవ అధికారిక వాట్సాప్ నంబర్ 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపి, “DEECET Hall Ticket” అని టైప్ చేయాలి. మెనూలో కనిపించే “Open Service” ఎంపికను ఎంచుకుని పేమెంట్ ఐడీ, అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. వెంటనే హాల్ టికెట్ వాట్సాప్‌లోకి వచ్చేస్తుంది. ఈ డిజిటల్ సేవల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించిన సేవలు వేగంగా, పారదర్శకంగా అందుతాయని అధికారులు తెలిపారు.
ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో మీసేవ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు ఈఎస్డీ విభాగం వెల్లడించింది. ఇప్పటికే 2025 నవంబర్ 18న ప్రారంభించిన మీసేవ వాట్సాప్, చాట్‌బాట్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని పేర్కొంది. బర్త్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లతో పాటు పోలీస్ చలాన్ సేవలు, పవర్ బిల్లులు, బీఐఈ ఫలితాలు సహా పలు సేవలను జనం ఎక్కువగా ఉపయోగించుకున్నారని ఐటీశాఖ కమిషనర్ తెలిపారు. వాట్సాప్ బేస్డ్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



