త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | కోదండరామ్‌కో, శ్యామ్ మోహన్‌కో విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలి

Dasoju Sravan | గురుకుల టెండర్లలో వేల కోట్ల కుంభకోణంతో పాటు విద్యాశాఖలో అనేక అవకతవకలు జరిగినపుడు రేవంత్ (Revanth)కు విద్యా శాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేద‌ని.. కోదండ‌రామ్‌కో, శ్యామ్ మోహ‌న్‌కో విద్యాశాఖ మంత్రిగా అవ‌కాశం ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Sravan) సూచించారు.

S

Telangana | Published On Nov 22, 2026, 3.30 pm IST

Dasoju Sravan | కోదండరామ్‌కో, శ్యామ్ మోహన్‌కో విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలి
Advertisement
  • రేవంత్‌కు కొన‌సాగే అర్హ‌త లేదు.. ఈ విష‌యాన్ని బీజేపీ ప్రశ్నించ‌దా?
  • కేంద్రంలో స్మృతి ఇరానీ ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ ప్ర‌శ్నించలేదా!
  • ఇంట‌ర్ ర‌ద్దు నిర్ణ‌యం రేవంత్ అహంకార నిర్ణ‌య‌మే
  • ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్‌

Dasoju Sravan | త్రినేత్ర న్యూస్‌: గురుకుల టెండర్లలో వేల కోట్ల కుంభకోణంతో పాటు విద్యాశాఖలో అనేక అవకతవకలు జరిగినపుడు రేవంత్ (Revanth)కు విద్యా శాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేద‌ని.. కోదండ‌రామ్‌కో, శ్యామ్ మోహ‌న్‌కో విద్యాశాఖ మంత్రిగా అవ‌కాశం ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Sravan) సూచించారు. కేంద్రంలో స్మృతి ఇరానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు ఆమె విద్యార్హతలపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించిందన్నారు. విద్యార్హతలు లేని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నించదా? అని నిల‌దీశారు.

స్మృతి ఇరానీ విద్యా శాఖ మంత్రిగా ఉంటే ప్రశ్నించిన రాహుల్ గాంధి రేవంత్ ను విద్యాశాఖ మంత్రిగా తెలంగాణపై ఎందుకు రుద్దుతున్నారు? నీళ్ల లాగే విద్యను కూడా రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు దోచి ట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పథకాన్నైనా, పాలసీ నైనా ప్రవేశ పెట్టేపుడు విస్తృతమైన చర్చలు జరపాలి. పాలసీ మార్చేట‌పుడు జరిగే పర్య వసానాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హిట్లర్ లా పాలసీలపై ఫత్వాలు జారీ చేస్తున్నారు కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల్లో రేవంత్ 300 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసినట్టే ఇంటర్ బోర్డు పై ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం రేవంత్ అహంకార పూరిత నిర్ణయం. విద్యా శాఖ కు పూర్తి స్థాయి మంత్రి ఉండాలి కానీ రేవంత్ తన దగ్గర పెట్టుకుని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు. బడ్జెట్ లో విద్యా శాఖకు 15 శాతం కేటాయిస్తామని 8 శాతం కూడా కేటాయించలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధుల హామీ జీవోలకే పరిమితమయ్యింది. యూనివర్సిటీల్లో నియామకాలు వంతుల వారీగా చేయడం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించడమే.

ఆకునూరి నివేదిక‌ను మండ‌లిలో ఎందుకు పెట్ట‌లే?

పీవీ నరసింహ రావు 1968 లో అనేక చర్చల తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఇంటర్ బోర్డును కాంగ్రెస్సే రద్దు చేసింది. నేను ఇంటర్మీడియట్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన లేదు. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు పై ఆకునూరి మురళి నివేదికను అసెంబ్లీలో గానీ మండలిలో ఎందుకు పెట్టలేదు ? ఇంటర్ బోర్డు రద్దు ఎనుముల రేవంత్ రెడ్డి కుటుంబ వ్యవహారమా? రాష్ట్రం రేవంత్ తాత జాగీరా? ప్రైవేటు ఎస్టేటా?

మోదీ తెచ్చిన కొత్త విద్యా విధానాన్ని సోనియా వ్యతిరేకిస్తుంటే రేవంత్ ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కార్యకర్తను అని చెప్పదలుచుకున్నారా? ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయడం తెలంగాణ స్థానికతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. నీళ్ల లాగే విద్యను కూడా ఇతర రాష్ట్రాలకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తొమ్మిదో తరగతి నుంచి నాలుగేళ్లు వరుసగా ఎక్కడ చదివితే అక్కడ విద్యార్థులు స్థానికులవుతారు అని నీట్ లాంటి ఎంట్రన్స్ నిబంధనలు చెబుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఇంటర్ బోర్డు రద్దు వ్యతిరేకం. పాలసీ మార్చినపుడు న్యాయనిపుణుల సలహా తీసుకోవాలనే సోయి రేవంత్ కు లేదా? ఇంటర్ బోర్డు రద్దుపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. విద్యార్థి సంఘాలతో వెంటనే ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి.. కార్పొరేట్ విద్యా సంస్థలకే ఇంటర్ బోర్డు రద్దు మేలు చేస్తుంది.

తొక్కుతా, తోముతా అంటే ఫ‌లితాలు రావ్‌

రేవంత్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారు. ఇంటర్ బోర్డుపై నిర్ణయాన్ని తొందరపడి అమలు చేస్తే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. విద్యా శాఖను నిర్వహించడం కేవలం తాను మాత్రమే నిర్వహించగలను.. వేరే వారి వల్ల కాదు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇన్ని తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు. తొక్కుతా, తోముతా అని రేవంత్ రెడ్డి అనడం కాదు.. వాటితో విద్యాశాఖలో సత్ఫలితాలు రావు. పూర్తి సమయాన్ని కేటాయించే విద్యాశాఖ మంత్రి తెలంగాణకు కావాలి. కోదండరాం ఇంటర్ బోర్డు రద్దును సమర్ధిస్తే ఆయన రేవంత్ కు బానిసత్వం చేస్తున్నట్టే లెక్క. ఆకునూరి మురళి రిపోర్టు ను చట్టసభల్లో ప్రవేశ పెట్టక పోవడాన్ని కోదండరాం ఎలా సమర్థిస్తారు అని దాసోజు ప్రశ్నించారు.

Advertisement
Advertisement