త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | అప్పుడు 10.36 ల‌క్ష‌ల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే న‌మోదైన‌య్‌

MLC Dasoju Sravan | 2021లో గ్రాడ్యుయేట్‌ మ్మెల్సీ ఎన్నిక‌లు (Graduate MLC Elections) జ‌రిగిన‌ప్పుడు 10.36 ల‌క్ష‌ల ఓట్లుంటే ఈ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికీ 4.98 శాతమే న‌మోదు కావ‌డంలో ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ల‌క్ష్య‌మెలా ఉందో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan) విమర్శించారు.

S

Telangana | Published On Oct 26, 2026, 4.35 pm IST

MLC Dasoju Sravan | అప్పుడు 10.36 ల‌క్ష‌ల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే న‌మోదైన‌య్‌
Advertisement
  • ప్ర‌భుత్వం పండుకున్న‌దా? ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఉందా లేదా?
  • ఓటు తీసేయ‌డానికొచ్చిన బీఎల్‌వోలు.. న‌మోదుకు ఎందుకు రారు?
  • గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల న‌మోదులో నిర్ల‌క్ష్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్‌

MLC Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: 2021లో గ్రాడ్యుయేట్‌ మ్మెల్సీ ఎన్నిక‌లు (Graduate MLC Elections) జ‌రిగిన‌ప్పుడు 10.36 ల‌క్ష‌ల ఓట్లుంటే ఈ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికీ 4.98 శాతమే న‌మోదు కావ‌డంలో ఇటు ప్ర‌భుత్వం, అటు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ల‌క్ష్య‌మెలా ఉందో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan) విమర్శించారు. స‌ర్ ప్ర‌క్రియ‌లో ఓట్లు తీసేయ‌డానికి చూపించిన శ్ర‌ద్ధ ఇప్పుడు న‌మోదు చేయ‌డంలో చూపించ‌క‌పోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. క‌నీసం టీవీల్లో, సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు కూడా లేవ‌న్న‌నారు. ఓటు న‌మోదు చివ‌రి తేదీని పొడ‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈమేర‌కు సోమ‌వారం ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం అందించిన‌ అనంత‌రం బీఆర్‌కే భ‌వ‌న్ వ‌ద్ద ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల కమిష‌న్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

2021లో గ్రాడ్యుయేట్‌ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ఓటర్ల సంఖ్య 10 ల‌క్ష‌ల 36 వేలు. ఇవాళ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల కోసం కేవ‌లం 5 ల‌క్ష‌ల మందే ఫామ్‌లు సమ‌ర్పించారు. అస‌లు విష‌యం చూస్తే క‌ళ్ల‌ల్ల‌కెంచి రక్తం వ‌స్త‌ది. ఈ ప్ర‌భుత్వం పండుకుందా? ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉందా లేదా తెలుస్త‌ది. ఇప్ప‌టికీ 4.98 శాతమే అప్రూవ్ అయిన‌య్‌. దాదాపు 4.96 లక్షలు ఫామ్‌-18ల‌ను వారం రోజుల్లో అప్రూవ్ చేస్త‌మ‌ని చెప్తున్న‌రు. వాళ్ల దగ్గ‌ర మ్యాజిక్ మిష‌న్ ఉన్న‌ట్టు చెప్తున్న‌రు.

బీఎల్‌వోలు ఎందుకు రారు?

దున్న‌పోతు మీద నీళ్లు వ‌డ్డ‌ట్టు హైద‌రాబాద్, రంగారెడ్డి, న‌ల్లగొండ, వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌వ‌హ‌రిస్తున్న‌రు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌ది ఇంత నిర్ల‌క్ష్య‌మా? క్షేత్ర‌స్థాయిలో ఒక్క బీఎల్‌వో కూడా ప‌ని చేస్త‌లే. ఓట్లు తీసేయ‌డానికేమో ఇంటింటికి ఉరుకొచ్చిండు క‌దా. మ‌రి న‌మోదు కోసం బీఎల్‌వో ఎందుకు రాడు? ఇంత అల‌స‌త్వం ఎందుకు? క్షేత్ర‌స్థాయిలో వారిని ప‌ని చేయించండి.

అందుకే లాస్ట్ డేట్‌ను పొడ‌గించాల‌ని కోరినం. గెజిటెడ్ ఆఫీస‌ర్లు కూడా సంత‌కం చేయ‌మంటే చేయ‌ని దుస్థితి ఉంది. అందుకే కొన్ని నిర్దేశ‌కాలు జారీ చేయండి. ఎమ్మార్వోలు అందుబాటులో ఉండి అటెస్టేష‌న్ చేయాల‌ని కోరాం. హైద‌రాబాద్‌లో దాదాపు 10 ల‌క్ష‌ల మంది ఐటీ ఉద్యోగులు ఉంట‌రు. వీరంద‌రినీ ఎన్నిక‌ల సంఘ‌మే సంప్ర‌దించి ఓటు న‌మోదయ్యేలా చూడాలి. టీవీల్లో, సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇస్త‌లేరు. పెద్ద ఎత్తున అవ‌గాహ‌న కార్యక్ర‌మాలు నిర్వ‌హించాలి. మంచి ప్ర‌తినిధుల‌ను చ‌ట్ట స‌భ‌ల‌కు పంపాలంటే గ్రాడ్యుయేట్లు ఓటు న‌మోదు చేసుకోవాలి అని దాసోజు కోరారు.

Advertisement
Advertisement