Dasoju Sravan Kumar | పాలన చేతకాకపోతే దిగిపో రేవంత్
Dasoju Sravan Kumar | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి పాలన చేతకాకపోతే దిగిపోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravan Kumar) సూచించారు. ఇదేం రాజ్యం, ఇదేం ప్రజా పాలన అని మండిపడ్డారు.
దోపిడీ తప్ప ఏమీ తెలియదు
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు
పరిపాలన చేస్తున్నావా? పరాచకాలు ఆడుతున్నావా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజం
Dasoju Sravan Kumar | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి పాలన చేతకాకపోతే దిగిపోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravan Kumar) సూచించారు. ఇదేం రాజ్యం, ఇదేం ప్రజా పాలన అని మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి దోపిడీ తప్ప ఏమీ తెలియదని దుయ్యబట్టారు. ఇదొక దోపిడీ ప్రభుత్వం, బాధ్యతారహితమైన ప్రభుత్వమని విమర్శించారు. పరిపాలన చేస్తున్నావా? పరాచకాలు ఆడుతున్నావా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ విద్యా శాఖను ఎవరైనా చదువుకున్న వారికి ఇవ్వాలని హితవు పలికారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను రేవంత్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు కోర్సులకు ఒకటే ప్రశ్నాపత్రం..
రెండు రోజుల క్రితం ఓ పత్రిక లో ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)కి సంబంధించి ఓ వార్త వచ్చిందని శ్రవణ్ గుర్తు చేశారు. ఉస్మానియా లో రెండు రకాల లా కోర్సులు ఉన్నాయని, ఒకటి ఐదేళ్ల లా కోర్సు, ఇంకొకటి మూడేళ్ల హానర్స్ కోర్సు ఉందని చెప్పారు. ఫిబ్రవరి 25న ఐదేళ్ల లా కోర్సు, ఫిబ్రవరి 27 న మూడేళ్ళ లా కోర్సు పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. రెండు కోర్సులకు సిలబస్ ఒకటే అయినా ప్రశ్నా పత్రం ఒకటిగా ఉండకూడదన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా సబ్జెక్టుకు, మూడేళ్ల లా కోర్సుకు లీగల్ అండ్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా సబ్జెక్టు పేపర్ ఒకటేలా వచ్చిందని ప్రశ్నించారు. రెండు రోజుల వ్యవధితో జరిగిన పరీక్షలకు ప్రశ్నాపత్రం ఒకేలా ఎలా ఉందన్నారు. ఒకటే పేపర్ ఇచ్చి తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏమి కావాలని దుయ్యబట్టారు. ప్రశ్నా పత్రం కూడా సరిగా సెట్ చేయరాని వారు ఏం పాలిస్తారని ఎద్దేవా చేశారు. బంకర్ బెడ్ల కొనుగోలులో వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 60 కోట్ల రూపాయలకు రావాల్సిన బంకర్ బెడ్లను 160 కోట్లకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలకు ఒకేషనల్ విద్యా సంస్థల టెండర్లు కట్టబెడుతున్నారని వాపోయారు.
తప్పుల తడకగా విద్యా కమిషన్ నివేదిక..
తెలంగాణ విద్యా కమిషన్ (Telangana Education Commission) రిపోర్టు తప్పుల తడకగా ఉందని దాసోజు ఆరోపించారు. గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు పది వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ములు ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన వెయ్యి కోట్లు ఎక్కడ అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. గ్రూప్ 1 లో అనేక తప్పులు జరిగాయని, కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినంత మాత్రాన సత్తె పూసలు కారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఎక్కడైనా ఇళ్లు కట్టారా..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ఎక్కడైనా ఇళ్లు కట్టారా అని శ్రవణ్ ప్రశ్నించారు. గాంధీ విగ్రహం పేరు మీద ఇళ్ళు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. శారదా పీఠంకు నోటీసులు ఇచ్చి బుల్డోజర్లతో కూలుస్తామని అన్నారని, కానీ హరీష్ రావు వెళ్ళగానే శారదా పీఠం భూములు వెనక్కి తీసుకోవడం లేదని ప్రకటించారని చెప్పారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు టీ హబ్ లో పెడతామని చెప్పి వెనక్కి తగ్గారని విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



