Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్
Danam Nagender | ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం ఖాళీ అయ్యింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యే కాదంటూ తెలంగాణ శాసనసభ గెజిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు సెప్టెంబర్ 18న ఇచ్చిన తీర్పు మేరకు రాజపత్రాన్ని విడుదల చేశారు.
Danam Nagender | ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం ఖాళీ అయ్యింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యే కాదంటూ తెలంగాణ శాసనసభ గెజిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు సెప్టెంబర్ 18న ఇచ్చిన తీర్పు మేరకు రాజపత్రాన్ని విడుదల చేశారు. దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనపై అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన సభ్యత్వం రద్దయినట్లు తీర్పు ఇచ్చింది. ఖైరతాబాద్ స్థానం కూడా అదే తేదీ నుంచి ఖాళీగా మారినట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చింది.
ఇక ఈసీకి ఖాళీ సమాచారం
తాజా గెజిట్‌తో అసెంబ్లీ రికార్డుల్లో ఖైరతాబాద్ స్థానం ఖాళీగా నమోదైంది. ఇక ఈ ఖాళీకి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల అధికారుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. ఖాళీ ఏర్పడిన వెంటనే సంబంధిత అధికారులు దాని సమాచారాన్ని ఈసీకి పంపాలని ఎన్నికల సంఘం గతంలోనే ఆదేశించింది. ఆ తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఉప ఎన్నిక ద్వారా ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది.
ఓటర్ల జాబితా సవరణ తర్వాతేనా?
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ఈసీ ప్రకటించనుంది. అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 7 వరకు, వాటి పరిష్కారం నవంబర్ 5 వరకు కొనసాగనుంది. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ఇప్పుడు ప్రధానంగా రెండు అంశాలపై ఆసక్తి నెలకొంది. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూసి నవంబర్ 9 తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారా? లేక అంతకుముందే ఉప ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారా? అన్నది ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి విదేశీ పర్యటన ఉన్నారు. అక్టోబర్ 8న తిరిగి వస్తారన్న సమాచారం నేపథ్యంలో ఈసీకి ఖాళీ సమాచారం పంపే ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్నదీ కీలకంగా మారింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
- ●Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ - లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?
- ●Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి
- ●Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!
- ●National Conference | జాతీయ రబీ సదస్సులో తెలంగాణ ప్రగతి
- ●Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే

Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు

Allu Arjun | పోలీస్ ఆఫీసర్‌గా బన్నీ - లోకేష్ కనగరాజ్ సినిమాపై కొత్త రూమర్?

Ex MLA Jeevan Reddy | అర గుండు, హాఫ్ నాలేడ్జ్ గాడివి నువ్.. డబ్బు కోసం ఏమైనా తినే కక్కుర్తిగాడివి

Jogulamba Gadwal | అమ్మకు అక్షరమాల..!




