Danam Nagender | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొంది. దీంతో ఆ స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరారు. ఇదిలా ఉండగా, హైకోర్టులోనే తీర్పుపై స్టే ఇవ్వాలన్న నాగేందర్ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



