త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Ramakrishna Rao | కొత్త సీఎస్ లేన‌ట్టేనా..? మ‌రో 3 నెల‌లు రామ‌కృష్ణా రావే ఉంటారా..!

CS Ramakrishna Rao | రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణారావు ప‌ద‌వీకాలం మార్చి 31వ తేదీ ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ ఎవ‌ర‌నే దానిపై నిన్న‌టి వ‌ర‌కు ఉత్కంఠ నెల‌కొని ఉండే.

S

Telangana | Published On Mar 10, 2026, 8.46 am IST

CS Ramakrishna Rao | కొత్త సీఎస్ లేన‌ట్టేనా..? మ‌రో 3 నెల‌లు రామ‌కృష్ణా రావే ఉంటారా..!
Advertisement

CS Ramakrishna Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణారావు ప‌ద‌వీకాలం మార్చి 31వ తేదీ ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ ఎవ‌ర‌నే దానిపై నిన్న‌టి వ‌ర‌కు ఉత్కంఠ నెల‌కొని ఉండే. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. జ‌యేశ్ రంజ‌న్ లేదా వికాస్ రాజ్‌ల‌లో ఎవ‌ర్నో ఒక‌రిని సీఎస్ ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని భావించారు. కానీ ప్ర‌స్తుత సీఎస్ రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలాన్ని మ‌రో 3 నెల‌లు పొడిగించేందుకు అనుమ‌తించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ)కి ప్రభుత్వం లేఖ రాసింది.

వాస్తవానికి కె.రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఆయన పదవీ కాలాన్ని ఏడు నెలలు పొడిగించడాని కి అప్పట్లో కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా రెండోసారి మరో 3 నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కేంద్రం తీసుకోనున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేంద్రం అనుమతిస్తే మరో 3 నెలల పాటు రామకృష్ణారావు సీఎస్‌గా కొనసాగుతారు. లేనిపక్షంలో సీనియారిటీ ప్రకారం ముందంజలో ఉన్న ఐఏఎస్‌ అధికారులు జయేశ్‌ రంజన్, వికాస్‌రాజ్‌లలో ఒకరిని కొత్త సీఎస్‌గా నియమించే అవకాశముంది.

Advertisement
Advertisement