త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crocodile | సంగారెడ్డి జిల్లాలో భారీ మొస‌లి ప్ర‌త్య‌క్షం..

Crocodile | సంగారెడ్డి జిల్లాలో శుక్ర‌వారం రాత్రి భారీ మొస‌లి( Crocodile ) ప్ర‌త్య‌క్ష‌మైంది. వ‌ట్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని కేరూర్( Kerur ) గ్రామ స‌మీపంలోని చెరువు క‌ట్ట వ‌ద్ద భారీ మొస‌లి ప్ర‌త్య‌క్షం కావ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

S

Telangana | Published On Dec 6, 2025, 2.34 pm IST

Crocodile | సంగారెడ్డి జిల్లాలో భారీ మొస‌లి ప్ర‌త్య‌క్షం..
Advertisement

Crocodile | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో శుక్ర‌వారం రాత్రి భారీ మొస‌లి( Crocodile ) ప్ర‌త్య‌క్ష‌మైంది. వ‌ట్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని కేరూర్( Kerur ) గ్రామ స‌మీపంలోని చెరువు క‌ట్ట వ‌ద్ద భారీ మొస‌లి ప్ర‌త్య‌క్షం కావ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. గ్రామ‌స్తులు అప్ర‌మ‌త్త‌మై అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

చెరువు క‌ట్ట వ‌ద్ద‌కు జిల్లా అట‌వీ శాఖ అధికారి సీహెచ్ శ్రీధ‌ర్ రావు త‌న బృందంతో చేరుకున్నారు. అక్క‌డున్న భారీ మొస‌లిని బంధించారు. ఆ త‌ర్వాత మొస‌లిని సింగూరుకు స‌మీప‌లోని మంజీరా న‌దిలో వ‌దిలేశారు. మొస‌లిని బంధించేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని అట‌వీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి హానీ కలిగించ‌కుండా, ముంద‌స్తుగా మొస‌లిని బంధించినందుకు అట‌వీ శాఖ అధికారుల‌కు స్థానికులు అభినంద‌న‌లు తెలిపారు. మొస‌ళ్ల సంచారం నేప‌థ్యంలో స్థానికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement