త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kunamneni Sambashiva Rao | వీళ్ల పరిపాలన చూస్తుంటే బీపీ లేస్తుంది..! ఎమ్మెల్యే కూనంనేని ఫైర్

Kunamneni Sambashiva Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీళ్ల ప‌రిపాల‌న చూస్తుంటే బీపీ లేస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Apr 3, 2026, 3.18 pm IST

Kunamneni Sambashiva Rao | వీళ్ల పరిపాలన చూస్తుంటే బీపీ లేస్తుంది..! ఎమ్మెల్యే కూనంనేని ఫైర్
Advertisement

Kunamneni Sambashiva Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీళ్ల ప‌రిపాల‌న చూస్తుంటే బీపీ లేస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కొత్త‌గూడెం బ‌స్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జాపాల‌న - ప్ర‌గ‌తి నివేదిక రోజుల కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు హాజరై ప్ర‌సంగించారు.

'వీళ్ల పరిపాలన.. వీళ్లు పాడుగాను. బీపీ లేస్తుంది. తిట్టలేక ఈ మాట అంటున్నా' అంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి. దీక్ష ఉండాలి. వీళ్లకు అది లేదు' అంటూ రేవంత్ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు.

నేనైతే ఏడాదిలోగా బస్టాండ్ స్వరూపాన్ని మార్చేవాడనని.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు పోరాటం చేద్దామ‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 143 బస్టాండ్‌ల‌ అభివృద్దికి రూ.5 కోట్ల చొప్పున రూ. 700 కోట్లు కేటాయించినా అవి మెరుగుపడేవన్నారు. వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఆ నిధులు పెద్ద సమస్య కాదంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు చుర‌క‌లంటించారు.

Advertisement
Advertisement