త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Kunamneni | కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకుంటాం : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLA Kunamneni | కాంగ్రెస్ పార్టీ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఆ పార్టీతో సాగుతున్న పొత్తును తెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

S

Telangana | Published On Mar 12, 2026, 4.07 pm IST

MLA Kunamneni | కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకుంటాం : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MLA Kunamneni | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఆ పార్టీతో సాగుతున్న పొత్తును తెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదు, కాంగ్రెస్ మిత్ర ధర్మం పాటించట్లేదు అని మండిప‌డ్డారు.

కొత్తగూడెం ఎపిసోడ్‌తో సీపీఐ - కాంగ్రెస్ మధ్య గ్యాప్ వచ్చింది.. మాతో మిత్రధర్మం పాటించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తేల్చుకుంటాం. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నాం. రైతుబంధుకు సంబంధించి ఇప్పటికే ఒక దఫా పెండింగ్‌లో ఉంది, మళ్లీ రెండో ద‌ఫాకి కూడా సమయం మించిపోయింది. ప్రభుత్వం అసలు రైతుబంధు వేస్తుందా.. వేయదా స్పష్టం చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.

పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని భూదాన బాధితులకు, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి. మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణిని నష్టాల్లోకి నెట్టివేస్తున్నారు.. ప్రభుత్వం తక్షణమే సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాల‌ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement