Health Insurance | టీనేజ్‌లో జరిగిన చికిత్సను దాచిపెట్టారని.. 64 ఏండ్లప్పుడు క్లెయిమ్ తిరస్కరించిన బీమా సంస్థ
Health Insurance | ఓ వ్యక్తి ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకున్నారు. అయితే ఆ సమయంలో తనకు 18 ఏండ్ల వయస్సులో తీసుకున్న చికిత్సను గురించి చెప్పలేదు. ప్రస్తుతం అతనికి 64 ఏండ్లు.
Health Insurance | త్రినేత్ర.న్యూస్: ఓ వ్యక్తి ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకున్నారు. అయితే ఆ సమయంలో తనకు 18 ఏండ్ల వయస్సులో తీసుకున్న చికిత్సను గురించి చెప్పలేదు. ప్రస్తుతం అతనికి 64 ఏండ్లు. రెండేండ్ల క్రితం అనారోగ్యానికి గురవడంతో దవాఖానలో చేరారు. దానికి రూ.3 లక్షలకుపైగా ఖర్చయింది. దానిని క్లెయిమ్ చేసుకున్నారు. అయితే టీనేజర్‌గా ఉన్నప్పుడు జరిగిన ట్రీట్‌మెంటును గురించి దాచిపెట్టాడని పేర్కొంటూ ఆ క్లెయిమ్‌ను ఆరోగ్య బీమా సంస్థ (Policy Claim) తిరస్కరించింది. బాధితులు వినియోగదారులకు కమిషన్‌కు (Consumer Forum) వెళ్లడంతో.. బీమా కంపెనీ ఫైన్‌తో సహా క్లెయిన్ చెల్లించాలని తీర్పునిచ్చింది.
బీ.సరస్వతి (64) అనే మహిళ మణిపాల్ సిగ్నా బీమా సంస్థలో హెల్త్ పాలసీ తీసుకున్నారు. కాళ్లనొప్పులతో నడవలేక బాధపడుతున్న ఆమె 2024, మే 25న సిద్ధార్ధ్ హాస్పిటల్‌లో చేరారు. చికిత్సకు రూ.3లక్షలకుపైగా ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు దవాఖానకు కట్టారు. అనంతరం పాలసీ ద్వారా చికిత్సకు అయిన డబ్బు చెల్లించాలని మణిపాల్ సిగ్నా బీమా సంస్థను ఆశ్రయించారు. ఎప్పుడో 18 ఏండ్ల వయసులో తీసుకున్న చికిత్స, ఆరేళ్ల క్రితం బ్రెయిన్ హేమరేజి కోసం పొందిన చికిత్సలను దాచిపెట్టి పాలసీ పొందినట్లు పేర్కొంటూ మణిపాల్ సిగ్నా బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించింది. దీంతో బాధితులు కమిషన్‌ను ఆశ్రయించగా తాజాగా సానుకూల తీర్పు వచ్చింది.
18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తీసుకున్న చికిత్సను దాచిపెట్టినట్లు పేర్కొంటూ 64 ఏండ్ల వయసులో చేసిన క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించడాన్ని వినియోగదారుల కమిషన్-1 తప్పుపట్టింది. అలా రిజక్ట్ చేయడం అక్రమమని, సేవాలోపంగా పేర్కొంటూ బాధితురాలికి చికిత్స ఖర్చులకు సంబంధించిన రూ.3,01,071 క్లెయిమ్‌ను... తిరస్కరించిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. నష్టపరిహారం రూ.30 వేలు, ఖర్చులు రూ.10 వేలను కూడా చెల్లించాలని స్పష్టంచేసింది. దీంతో ఆలస్యంగానైనా తమకు న్యాయం జరగడం పట్ల సత్యనారాయణ, సరస్వతి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం లేదా అన్లిమిటెడ్ రిస్టోరేషన్.. వాస్తవం ఏమిటి..?
ఏప్రిల్ 28, 2026

Health Insurance | వేగవంతం కానున్న హెల్త్ ఇన్సూరెన్స్ ల క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఐఆర్డీఏఐ కొత్త సబ్-కమిటీ ఏర్పాటు..
ఏప్రిల్ 11, 2026

Health Insurance | రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి రోజుల్లో ఒక కుటుంబానికి సరిపోతుందా..?
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



