MP Chamala Kiran Kumar Reddy | ఒక్క రూపాయికే శారదా పీఠానికి భూములిచ్చారు : ఎంపీ చామల
MP Chamala Kiran Kumar Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 150 కోట్ల విలువైన కోకాపేట్ భూములను కేవలం ఒక్క రూపాయికే శారదా పీఠానికి అప్పగించారు అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
శంషాబాద్‌కు శారదా పీఠం..
కాంగ్రెస్‌కు భక్తిశ్రద్ధలున్నాయి..
మూసీకి, సబర్మతికి సంబంధముంది..
హరీశ్‌రావు, రామచందర్ రావుపై ఎంపీ చామల ఫైర్
MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 150 కోట్ల విలువైన కోకాపేట్ భూములను కేవలం ఒక్క రూపాయికే శారదా పీఠానికి అప్పగించారు అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాధాన్యత కూడిన ప్రాంతాల్లో నచ్చిన వారి కోసం భూములను బీఆర్ఎస్ నాయకులు పంచారని మండిపడ్డారు. కోకాపేట్ భూములపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
శారదా పీఠం భూమిని వాళ్ళ అనుమతితో శంషాబాద్ తరలిస్తున్నారు. శారదా పీఠం ఉన్న ఏరియాలో ప్రజలకు మంజీరా నీళ్లు అందించడానికి వాటర్ వర్క్స్ జరుగుతున్నవి. కోర్ అర్బన్ ఏరియాలో మెట్రో, మూసీని అభివృద్ధి చేయడం ప్రజల కోసమే. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరగొద్దని హరీశ్‌రావు, కేటీఆర్ అడ్డుపడుతున్నారు. వారిద్దరి పోజిషన్ ఏంటో తెలియదు. మేము అపోజిషన్ అంటున్నాం. మా ప్రభుత్వానికి కూడా భక్తిశ్రద్ధలు ఉన్నాయి. వేములవాడ, సమ్మక్క సారక్క దేవాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో మంచి జరిగితే మళ్ళీ కాంగ్రెస్‌కు పట్టం కడతారని హరీశ్‌రావు, కేటీఆర్ విష బీజాలు వేస్తున్నారు. మీలాగ కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
గుజరాత్‌లో మోదీ సబర్మతిని అభివృద్ధి చేసినట్లు.. తెలంగాణలో మూసీ అభివృద్ధి జరగొద్దా..? సబర్మతికి, మూసీకి సంబంధం లేదు అని రామచందర్ రావు అంటుండు. మూసీకి సబర్మతికి ఎందుకు సంబంధం లేదు. గాంధీ నగర్‌లో నది ఒడ్డున ఎన్ని ఇండ్లను తరలించారు. మీరు అక్రమంగా ఇండ్లను తరలించొచ్చు కానీ.. ఇక్కడ చేయకూడదా..? ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడితే ఎలా..? అని ఎంపీ చామల ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



