త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Raj Gopal Reddy | ప్ర‌భుత్వం ఉన్న‌ది పేద‌ల కోసం.. పెట్టుబ‌డిదారుల కోసం కాదు..

Komatireddy Raj Gopal Reddy | ప్రభుత్వం అనేది పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా ధనవంతుల కోసం కాకుండా కేవలం కష్టాల్లో ఉన్న పేదల కోసమే పనిచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Nov 17, 2026, 4.11 pm IST

Komatireddy Raj Gopal Reddy | ప్ర‌భుత్వం ఉన్న‌ది పేద‌ల కోసం.. పెట్టుబ‌డిదారుల కోసం కాదు..
Advertisement

క‌ష్టాల్లో ఉన్న పేద‌ల కోస‌మే ఈ ప్ర‌భుత్వం ప‌ని చేయాలి
నాలుగు వేల పెన్ష‌న్ కోసం పోరాడుతా
కాంగ్రెస్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

Komatireddy Raj Gopal Reddy | త్రినేత్ర న్యూస్ : ప్రభుత్వం అనేది పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా ధనవంతుల కోసం కాకుండా కేవలం కష్టాల్లో ఉన్న పేదల కోసమే పనిచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఒంట‌రి మ‌హిళ‌ల పెన్ష‌న్ల పంపిణీ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత ప్ర‌భుత్వానికి చుర‌క‌లంటించారు.

ప్ర‌భుత్వం ఉన్న‌ది పేద‌ల కోసం.. పెట్టుబ‌డిదారుల కోసం కాదు. కాంట్రాక్ట‌ర్ల కోసం కాదు. ధ‌న‌వంతుల కోసం కాదు. ఈ ప్ర‌భుత్వం ప‌ని చేయాల్సింది పేద‌ల కోసం. క‌ష్టాల్లో ఉన్న పేద‌వాళ్ల కోస‌మే ఈ ప్ర‌భుత్వం ప‌ని చేయాలి. అభివృద్ధి పేరు మీద అవినీతి జ‌ర‌గ‌కూడ‌దు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది త్యాగాల పునాదుల మీద‌. 60 ఏండ్లు పోరాటం చేసి, 1000 మంది బ‌లిదానాలు చేసుకున్న త‌ర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది. మా క‌ష్టాలు పోత‌య్.. మా బ‌తుకులు మారుత‌య్ అని చెప్పి కోట్లాది మంది ఎదురుచూశారు. కానీ తెలంగాణ‌లో అనుకున్న స్థాయిలో పేద‌వాళ్ల‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఆవేద‌న‌లో ఉన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం నాలుగు వేల పెన్ష‌న్ ఇస్తే పెద్ద మ‌న‌షులు క‌డుపు నిండా అన్నం తింట‌రు. ఈ విష‌యాన్ని త్ప‌కుండా సీఎం దృష్టికి తీసుకుపోతా. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద‌ల పార్టీ. ఇందిర‌మ్మ రాజ్యం వ‌చ్చింది.. మా కష్టాలు పోతాయ‌ని పేద‌లు ఎదురుచూస్తున్నారు. పేద‌ల కోసం ఈ ప్ర‌భుత్వం ప‌ని చేయాల‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement