త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | తెలంగాణ‌లో సారా దుకాణాలు తెర‌వాల్సిందే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

MLA Anirudh Reddy | అధికార పార్టీపైనే రుస‌రుస‌లాడుతూ.. రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరుగుతూ నిత్యం వార్త‌ల్లో నిలిచే జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Mar 9, 2026, 5.58 pm IST

MLA Anirudh Reddy | తెలంగాణ‌లో సారా దుకాణాలు తెర‌వాల్సిందే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : అధికార పార్టీపైనే రుస‌రుస‌లాడుతూ.. రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరుగుతూ నిత్యం వార్త‌ల్లో నిలిచే జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సారా దుకాణాలు మ‌ళ్లీ ప్రారంభించాల‌ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల్లో బాంబు పేలుస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌చివాల‌యంలో అనిరుధ్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ రాష్టంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని అసెంబ్లీలో కోరుతాను. సారా తాగి 115 సంవత్సరాల పాటు బ‌తికారు. ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు. శాస్త్రీయంగా సారా ఆరోగ్యానికి హానికరం కాదు. ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు ప్రారంభించాయి. అస‌లు తెలంగాణ రాష్టంలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారు..? స్ప‌ష్ట‌త‌ రావాల్సిన అవ‌స‌రం ఉంది. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారికంగా నడుపుతున్నాయ‌ని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు.

Advertisement
Advertisement