Adi Srinivas | మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబైతో కాదు.. టోక్యో, సింగపూర్, న్యూయార్క్‌తో : ఆది శ్రీనివాస్
Adi Srinivas | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దబోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాసనసభలో ప్రకటించారు. మా పోటీ బెంగళూరు, చెన్నై, ముంబైతో కాదు.. టోక్యో, సింగపూర్, న్యూయార్క్‌తో పోటీ పడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
Adi Srinivas | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దబోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాసనసభలో ప్రకటించారు. మా పోటీ బెంగళూరు, చెన్నై, ముంబైతో కాదు.. టోక్యో, సింగపూర్, న్యూయార్క్‌తో పోటీ పడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రసంగించారు.
రెండేండ్ల మా ప్రభుత్వ పాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉంది. మా ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను గవర్నర్ వివరించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతోంది. ఇందిరమ్మ రాజ్యంలో సకల జనులు సంతోషంగా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ అప్పుల తెలంగాణను గట్టెక్కిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. కానీ మేం 2023లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 8 లక్షల కోట్ల అప్పులతో అప్పజెప్పారు. అప్పులకుప్ప చేసి మా చేతికి ఇచ్చినప్పటికీ, మా సీఎం గుండె ధైర్యంతో పని చేస్తూ ముందుకు సాగుతున్నారు. రైజింగ్ తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నారు. దేశంలోనే హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం. మా పోటీ బెంగళూరు, చెన్నై, ముంబై కాదు.. టోక్యో సింగపూర న్యూయార్క్‌తో అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి విజయవంతం చేశాం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. ప్రపంచాన్ని హైదరాబాద్ వైపు ఆకర్షించేలా చేశాం. సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కృషితో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు సాధించి, కొత్త రికార్డు సృష్టించాం. దావోస్ పెట్టుబడులతో కలిపితే ఇంచుమించు రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో రూ. 17 వేల కోట్ల పెట్టుబడులను సాధించాం. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రేవంత్ ధైర్యశాలి.. సాధించే ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అని ఆది శ్రీనివాస్ అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



