Harish Rao | కొత్త పార్టీ పెట్టబోతున్న హరీశ్‌రావు..!
Harish Rao | కేసీఆర్ కుటుంబంలో ఇప్పటికే రెండు పార్టీలు పుట్టుకొచ్చాయని, రేపు పొద్దుగాళ్ల హరీశ్‌రావు కూడా పార్టీ పెట్టబోతడు అని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : కేసీఆర్ కుటుంబంలో ఇప్పటికే రెండు పార్టీలు పుట్టుకొచ్చాయని, రేపు పొద్దుగాళ్ల హరీశ్‌రావు కూడా పార్టీ పెట్టబోతడు అని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో గజ్జల కాంతం శనివారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పేరు మీద కేసీఆర్ పార్టీ పెట్టుకున్నారు.. ఇప్పుడు కవిత తెలంగాణ పేరు మీద ఒక పార్టీ పెట్టుకున్నారు.. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అందరూ కలిసి పార్టీ పెట్టారంటే ఒక అర్థం ఉంటది. ఎందుకంటే నూటికి 85 శాతం ఉన్నారు కాబట్టి. మీరు 0.5 శాతం లేరు.. మీ ఇంట్లో రెండు పార్టీలో ఉన్నాయి. రేపు పొద్దుగాళ్ల హరీశ్‌రావు ఒక పార్టీ పెట్టబోతడు. మీరు రాష్ట్రం మొత్తం కలిస్తే లక్ష మంది ఉండరు.. రాష్ట్రాన్ని శాసిస్తామంటే సరియైనదా..? అధికారం వద్దా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని గజ్జల కాంతం పేర్కొన్నారు.
తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రగతి భవన్‌లో, పామ్ హౌస్‌లో పడుకుండు. ప్రజల కోసం ఏనాడు ఆలోచించలేదు. మా అయ్య ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అని కేటీఆర్ అంటుండు. మాకు అధికారం వద్దు కాపలా కుక్కలాగ ఉంటా అన్నడు కేసీఆర్. దొర కుటుంబాన్ని రాష్ట్రం నుండి తరిమేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని గజ్జల కాంతం అన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి మూడు లక్షల కోట్లు దోచుకున్నారు. మీరు దోచుకున్న ఆస్తులన్ని ప్రజలకు ఇచ్చే దాకా మీకు ప్రజలు మిమ్ముల్ని క్షమించరు. మీరు చేసిన అప్పులకు సీఎం రేవంత్ రెడ్డి వడ్డీలు కడుతూ ప్రజల కిచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం పని చేస్తున్నాడు సీఎం. ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు అన్ని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చ బోతున్నాడు. మా కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని గజ్జల కాంతం అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



