Sampath Kumar | హరీశ్‌రావు రూ. 30 కోట్లు ఆఫర్ చేశారు : మాజీ ఎమ్మెల్యే సంపత్
Sampath Kumar | గతంలో పార్టీ మారాలని హరీశ్‌రావు నాకు రూ. 30 కోట్లు ఆఫర్ చేశారని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరనరాన కాంగ్రెస్ భావజాలం ఉన్నవాడిని.. పార్టీని మారే అవకాశమే లేదని చెప్పానని ఆయన గుర్తు చేశారు.
Sampath Kumar | త్రినేత్ర.న్యూస్ : గతంలో పార్టీ మారాలని హరీశ్‌రావు నాకు రూ. 30 కోట్లు ఆఫర్ చేశారని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరనరాన కాంగ్రెస్ భావజాలం ఉన్నవాడిని.. పార్టీని మారే అవకాశమే లేదని చెప్పానని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు, మన్నె క్రిశాంక్‌పై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన సందర్భంగా సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
నా పైన, నా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసిన వారిపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశాం. హరీశ్ రావు, కేటీఆర్, మన్నె క్రిశాంక్, నమస్తే తెలంగాణ పత్రిక, తెలుగు స్క్రైబ్‌పై పరువు నష్టం దావా వేశాం. జన్వాడ ఫామ్ హౌస్‌లో రచించిన కట్టుకథనాలను సొంత పత్రికలో ప్రచారం చేశారు. చిన్న కాంట్రాక్టర్ దగ్గర నేను రూ. 8 కోట్లు అడిగినట్టు మసిపూసి మారేడు కాయ చేశారు. న్యాయపరంగానే పోరాడుతాను. టైం పడుతుంది.. కానీ నాపై విషం చిమ్మిన వారికి శిక్ష పడుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ నపుంసక రాజకీయాలు చేయొద్దని హెచ్చరిస్తున్నా. రాజకీయాలు చేతకాక పోతే, చేతకాదని చెప్పి.. మీ అయ్య లాగా ఫామ్ హౌస్‌లో పడుకోండి. అడ్డగోలు రాతలు రాస్తే మర్యాద ఉండదు అని హెచ్చరిస్తున్నా. బీఆర్ఎస్ నాయకులు నపుంసక రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సంపత్ కుమార్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



