త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asset Allocation | తక్కువ రిస్క్‌తో భారీ రాబడులు.. సరైన అసెట్ అలొకేషన్‌తో సంపద సృష్టి..

Asset Allocation | దీర్ఘకాలికంగా సంపదను నిర్మించడంలో అసెట్ అలొకేషన్ ఎంత కీలకమో చాలా మంది ఇన్వెస్టర్లు పూర్తిగా అర్థం చేసుకోరు. ఎక్కువ రాబడులు ఇస్తున్న ఒకే అసెట్‌పై పెట్టుబడులు పెట్టడం తాత్కాలిక లాభాలు ఇవ్వొచ్చు.

S

Business | Published On May 22, 2026, 3.43 pm IST

Asset Allocation | తక్కువ రిస్క్‌తో భారీ రాబడులు.. సరైన అసెట్ అలొకేషన్‌తో సంపద సృష్టి..
Advertisement

Asset Allocation | దీర్ఘకాలికంగా సంపదను నిర్మించడంలో అసెట్ అలొకేషన్ ఎంత కీలకమో చాలా మంది ఇన్వెస్టర్లు పూర్తిగా అర్థం చేసుకోరు. ఎక్కువ రాబడులు ఇస్తున్న ఒకే అసెట్‌పై పెట్టుబడులు పెట్టడం తాత్కాలిక లాభాలు ఇవ్వొచ్చు. కానీ ఈక్విటీ, డెట్, గోల్డ్‌లను సరైన నిష్పత్తిలో కలిపి పెట్టుబడి పెడితే మార్కెట్ హెచ్చుతగ్గుల్లో కూడా స్థిరమైన, మెరుగైన రాబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఇటీవల ఫండ్స్ ఇండియా విడుదల చేసిన వెల్త్ కన్వర్సేషన్స్ రిపోర్ట్‌లో ఈక్విటీ, డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్, అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్‌పై ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం సంపద సృష్టి అనేది కేవలం అత్యధిక రాబడులు ఇచ్చే అసెట్‌ను ఎంచుకోవడంపై ఆధారపడదు. సరైన అసెట్ మిక్స్ ఉండటమే అసలు కీలక అంశమని పేర్కొంది. ఈ రిపోర్ట్ ఇన్వెస్టింగ్‌లో అత్యంత ముఖ్యమైన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీర్ఘకాలిక రాబడులు కేవలం ఒకే బెస్ట్ అసెట్‌ను ఎంచుకోవడం వల్ల రావు. సరైన అసెట్ మిక్స్ ఉండాలి. ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభిన్న అసెట్ క్లాసుల్లో పెట్టుబడులను విభజించడం ద్వారా స్థిరమైన సంపద నిర్మాణం సాధ్యమవుతుంది.

అసెట్ అలొకేష‌న్‌తో అధిక రాబ‌డి..

ప్రతి అసెట్ క్లాస్ మార్కెట్ సైకిల్స్‌లో వేర్వేరుగా ప్రదర్శన ఇస్తుంది. ఈక్విటీలు దీర్ఘకాలంలో బలమైన వృద్ధిని అందిస్తే, డెట్ అసెట్స్ మార్కెట్ అస్థిరత సమయంలో స్థిరత్వాన్ని ఇస్తాయి. గోల్డ్ మాత్రం హెడ్జ్‌లా పనిచేస్తుంది. అందువల్ల మొత్తం డబ్బును ఒకే హై రిటర్న్ అసెట్‌లో పెట్టడం కంటే బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో రూపొందించడం విజయవంతమైన ఇన్వెస్టింగ్‌కు కీలకం. రిపోర్ట్ ప్రకారం గత 20 ఏళ్లలో పూర్తిగా ఈక్విటీ ఆధారిత పోర్ట్‌ఫోలియో వార్షికంగా 11.3 శాతం రాబడిని ఇచ్చింది. అయితే అదే సమయంలో దాదాపు 60 శాతం వరకు భారీ డ్రాడౌన్‌ను కూడా చూసింది. అంటే అధిక వోలాటిలిటీ కనిపించింది. మరోవైపు డెట్ అసెట్స్ కేవలం 4.4 శాతం డ్రాడౌన్‌తో ఎక్కువ స్థిరత్వాన్ని అందించాయి. అయితే వాటి వార్షిక రాబడులు 7.5 శాతానికి పరిమితమయ్యాయి. ఆసక్తికరంగా ఈక్విటీ, డెట్, గోల్డ్ కలిపిన పోర్ట్‌ఫోలియోలు మరింత సమతుల్య ఫలితాలు ఇచ్చాయి. ఉదాహరణకు 70 శాతం ఈక్విటీ, 15 శాతం డెట్, 15 శాతం గోల్డ్ కలిగిన పోర్ట్‌ఫోలియో సంవత్సరానికి 12.6 శాతం రాబడిని అందించింది. అదే సమయంలో డ్రాడౌన్‌ను సుమారు 39 శాతానికి పరిమితం చేసింది. ఇక 50:25:25 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ కలిగిన పోర్ట్‌ఫోలియో కూడా దాదాపు సమాన రాబడులు ఇచ్చింది. అయితే డ్రాడౌన్ కేవలం 27.4 శాతమే ఉండటం గమనార్హం.

ఈ నిష్ప‌త్తిలో ఉండాలి..

తక్కువ కాలానికి చూస్తే 70 శాతం ఈక్విటీ, 15 శాతం డెట్, 15 శాతం గోల్డ్ స్ట్రాటజీ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు రిపోర్ట్ చెబుతోంది. ఐదేళ్ల కాలవ్యవధిలో ఈ స్ట్రాటజీ 85 శాతం సందర్భాల్లో 10 శాతానికి పైగా రాబడులు ఇచ్చింది. ఏడేళ్ల కాలవ్యవధిలో ఇదే రాబడులు 92 శాతం సందర్భాల్లో నమోదయ్యాయి. డైవర్సిఫికేషన్ ద్వారా ఇన్వెస్టర్లు మంచి దీర్ఘకాలిక రాబడులు సాధించడంతోపాటు వోలాటిలిటీ, నష్టాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఒకే అసెట్ క్లాస్‌పై పూర్తిగా ఆధారపడకుండా, విభిన్న అసెట్స్‌లో పెట్టుబడుల‌ను విభజించడం ద్వారా స్థిరమైన సంపద సృష్టి సాధ్యమవుతుంది.

Advertisement
Advertisement