త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నేడు సిద్దిపేట‌లో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. ఇందిర‌మ్మ జీవిత బీమా ప‌థ‌కం ప్రారంభం

CM Revanth Reddy | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇందిర‌మ్మ కుటుంబ జీవిత బీమా ప‌థ‌కాన్ని సీఎం ప్రారంభించ‌నున్నారు.

S

Telangana | Published On Nov 19, 2026, 6.20 am IST

CM Revanth Reddy | నేడు సిద్దిపేట‌లో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. ఇందిర‌మ్మ జీవిత బీమా ప‌థ‌కం ప్రారంభం
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇందిర‌మ్మ కుటుంబ జీవిత బీమా ప‌థ‌కాన్ని సీఎం ప్రారంభించ‌నున్నారు. దుబ్బాక, సిద్దిపేట‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సిద్దిపేట ప‌ర్య‌ట‌న కంటే ముందు... సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు సిద్దిపేట పట్టణంలో నిర్వహించే ర్యాలీలో పాల్గొని, ర్యాలీ ముగిసిన తర్వాత బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. సిద్దిపేట ఇందిరా చౌర‌స్తా నుంచి స‌భ నిర్వ‌హించే నాగ‌దేవ‌త కూడలి వ‌ర‌కు 2.2 కిలోమీట‌ర్ల మేర సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాద‌యాత్ర చేయ‌నున్నారు.

Advertisement
Advertisement