Vanamahotsavam | 18 నుంచి వనమహోత్సవం.. 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
Vanamahotsavam | రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవం (Vanamahotsavam) 2026 ఈ నెల 18న ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని (Gurramguda park) అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Vanamahotsavam | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవం (Vanamahotsavam) 2026 ఈ నెల 18న ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని (Gurramguda park) అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా 12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంతో పోలిస్తే నర్సరీల్లో ఉన్న మొక్కలు 45 లక్షలు తక్కువగా ఉండటం గమనార్హం.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్ల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో 4.50 కోట్లు, అటవీ శాఖ 89.59 లక్షల మొక్కల పెంపకం, నాటడం చేపట్టనుంది. ఆయా ప్రభుత్వం శాఖలు కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నాయి.
వనమహోత్సవంలో భాగంగా వేప, మర్రి, రావి, చింత వంటి నీడను ఇచ్చే చెట్లతో పాటు జామ, సీతాఫలం, నేరేడు వంటి పండ్ల మొక్కలు, అలాగే వివిధ రకాల పూల మొక్కలను నాటనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, వర్షాలు సమృద్ధిగా కురవడానికి ఈ వనమహోత్సవం దోహదపడనుంది.
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి





