త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం

CM Revanth Reddy | రాష్ట్రంలో అర్హులైన వారంద‌రికీ పెన్ష‌న్లు ఇస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ద‌ర‌ఖాస్తు పెట్టుకుంటే చాలు.. పెన్ష‌న్లు మంజూరు చేస్తామ‌ని సీఎం చెప్పారు.

S

Telangana | Published On Aug 15, 2026, 7.07 pm IST

CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం
Advertisement

అర్హులైతే చాలు.. దరఖాస్తు చేసుకోండి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అర్హులైన వారంద‌రికీ పెన్ష‌న్లు ఇస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ద‌ర‌ఖాస్తు పెట్టుకుంటే చాలు.. పెన్ష‌న్లు మంజూరు చేస్తామ‌ని సీఎం చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇవాళ రెండున్న‌ర ల‌క్ష‌ల పెన్ష‌న్లు మంజూరు చేసినం. వింత‌తువులు, ఒంట‌రి మ‌హిళ‌లు, భ‌ర్త‌లు చ‌నిపోయిన వారు ఉన్నా ద‌ర‌ఖాస్తు పెట్టుకోండి. ఎన్ని ల‌క్ష‌ల మంది ఉన్న అంద‌రికీ పెన్ష‌న్ అందించే బాధ్య‌త నాది. అదే విధంగా చేనేత‌, గీత కార్మికులు, వివిధ ర‌కాల వ్యాధులు ఉన్న‌వారికి కూడా పెన్ష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఇందిర‌మ్మ రాజ్యంలోనే ఇవ‌న్నీ సాధ్య‌మ‌వుతాయి. ప‌థ‌కాల అమ‌లు జ‌రుగుతాయి అని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఇందిరమ్మ రాజ్యం అంటేనే మ‌హిళా ప్ర‌భుత్వం. మా ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు గౌర‌వం, బాధ్య‌త ఉంటుంది. ప‌రిపాల‌న‌లో వారికి భాగస్వామ్యం ఉంట‌ది. మంత్రి ప‌ద‌వి లేని ఇవ్వ‌లేని వాడు.. ఈరోజు ఉద్ద‌రించే మాట‌లు మాట్లాడుతున్న‌డు.. సలాకి ఎర్ర‌గా కాల్చి వాత‌లు పెడితే.. ఇలాంటి త‌ప్పుడు మాట‌లు త‌క్కువ‌గా మాట్లాడుత‌రు అని సీఎం అన్నారు.

Advertisement
Advertisement