CM Revanth Reddy | జెన్ ఆల్ఫా, జెన్ బీటా గురించి ఆలోచిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరానికి కూడా దృష్టిలో ఉంచుకుని విద్యా విధానం తీసుకొస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, తలరాతలు మార్చేది విద్య అని నమ్మి విద్యా శాఖ నా దగ్గర పెట్టుకున్నా.. నాకు విద్యాశాఖపై ఒక ప్యాషన్ ఉందన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరానికి కూడా దృష్టిలో ఉంచుకుని విద్యా విధానం తీసుకొస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, తలరాతలు మార్చేది విద్య అని నమ్మి విద్యా శాఖ నా దగ్గర పెట్టుకున్నా.. నాకు విద్యాశాఖపై ఒక ప్యాషన్ ఉందన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
తెలంగాణ విద్యా విధానంపై సభలో చర్చ జరగడం ఒక శుభ పరిణామం. సభ్యుల సూచనలపై సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. దేశంలోని ఏ విద్యా సంస్థ అయినా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులపైనే నిర్మితమైంది అని సీఎం పేర్కొన్నారు.
యూనివర్సిటీలన్నీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఏర్పాటు చేసినవే
ఇప్పుడున్న చాలా యూనివర్సిటీలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే. విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీపెక్ సర్వే నిర్వహించింది. సామాజిక వెనుకబాటుకు ఆస్తులు, అంతస్తులు కాదు.. విద్య లేకపోవడమే సామాజిక వెనుకబాటు తనానికి కారణమని సర్వేలో తేలింది అని రేవంత్ తెలిపారు.
మీ సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధం
ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య విధానంలో తీసుకు రావాల్సిన అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నూతన విద్యా విధానం రూపొందించేందుకు విద్య కమిషన్‌ను ఏర్పాటు చేశాం. విద్యా కమిషన్ అందించిన రిపోర్ట్‌ను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో ఒక కమిటీని నియమించాం. మీ సూచనలు, సలహాలను కేశవరావుకు అందిస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది. విద్య కోసం 15 శాతానికి బడ్జెట్‌ను పెంచడమే మా లక్ష్యం అని సీఎం ఉద్ఘాటించారు.
ఈ తేడా కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరం
పూర్తిస్థాయి విద్యా శాఖ మంత్రి లేడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ శాఖను నిర్వహిస్తున్నారంటే అది అత్యంత ప్రధానమైనదని అర్థం. ముఖ్యమంత్రిగా నేను ఎడ్యుకేషన్ సమీక్ష చేస్తే మొత్తం సిస్టమ్ వచ్చి సమీక్షలో ఉంటుంది. ఈ మాత్రం తేడా కూడా సభ్యుడికి తెలియకపోవడం బాధాకరం అని సీఎం పేర్కొన్నారు.
విద్యాశాఖ బడ్జెట్‌ను రూ. 7,554 కోట్లకు పెంచినం..
2023-24 బడ్జెట్‌లో బీఆరెస్ ప్రభుత్వం విద్యా శాఖకు రూ.19,093 కోట్లు కేటాయిస్తే.. మా ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో రూ.21,292 కోట్లు కేటాయించింది. 2025-26 బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.23,108 కోట్లకు, 2026-27 బడ్జెట్‌లో రూ.26,647 కోట్లకు పెంచాం. కేవలం మూడేళ్లలో విద్యా శాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్లకు పెంచామని సీఎం తెలిపారు.
చిన్న ఆరోపణ లేకుండా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం
మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 రోజుల్లోనే 10,006 మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశాం. చిన్న ఆరోపణ లేకుండా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7857 మంది టీచర్లను నియమించారని రేవంత్ అన్నారు.
కొన్ని వివాదాలు తప్పవు.. అదే జీవో 97
కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు చేసినపుడు కొన్ని వివాదాలు జరుగుతాయి. అలాంటిదే పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో ఎంఎస్ నెం.97 అని సీఎం తెలిపారు.
విద్యాశాఖ మంత్రిగా నా పనితీరుకు ఇది నిదర్శనం
నేను విద్యా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మంది పెరిగారు. ఇది విద్యా శాఖ మంత్రిగా నా పనితీరుకు నిదర్శనం అని సీఎం స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
సెప్టెంబర్ 11, 2026

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
సెప్టెంబర్ 11, 2026

Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Traffic restrictions | హైదరాబాద్‌లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్‌చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు
- ●Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Traffic restrictions | హైదరాబాద్‌లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్‌చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు

Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి



