త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో క‌రెంట్ కోసం రైతుల ధ‌ర్నా.. బాధాక‌ర‌మ‌న్న డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిప‌ల్లి స‌మీపంలో క‌రెంట్ కోసం రైతులు ధ‌ర్నా చేయ‌డం బాధాక‌ర‌మ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. శాస‌న‌మండ‌లిలో విద్యుత్ కోత‌ల‌పై ప్ర‌తిప‌క్ష స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు భ‌ట్టి స‌మాధానం ఇస్తూ ఇలా స్పందించారు.

S

Flash news | Published On Sep 11, 2026, 7.37 pm IST

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో క‌రెంట్ కోసం రైతుల ధ‌ర్నా.. బాధాక‌ర‌మ‌న్న డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిప‌ల్లి స‌మీపంలో క‌రెంట్ కోసం రైతులు ధ‌ర్నా చేయ‌డం బాధాక‌ర‌మ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. శాస‌న‌మండ‌లిలో విద్యుత్ కోత‌ల‌పై ప్ర‌తిప‌క్ష స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు భ‌ట్టి స‌మాధానం ఇస్తూ ఇలా స్పందించారు.

సీఎం సొంతూరు కొండారెడ్డిప‌ల్లి స‌మీపంలో రైతులు అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ క‌రెంట్ కోసం ధ‌ర్నా చేశారు.. మీకు క‌న‌బ‌డుత లేదా అని వారు వ్యంగ్యంగా అన్నారు.. య‌స్ నాకు క‌న‌బ‌డుతుంది.. బాధ‌గా కూడా ఉంది. అది రాష్ట్ర ప్ర‌భుత్వ త‌ప్పిదం వ‌ల్ల కాదు క‌దా.. మ‌నం నిర్ణ‌యాలు చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల కాదు క‌దా.. ప్ర‌కృతిలో సంభ‌వించిన ఎల్‌నినో వ‌ల్ల‌. ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో సంభ‌వించిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల, వేడిగాలులు పెద్ద ఎత్తున లేచి రుతుప‌వ‌నాల‌న్నింటిని దూరంగా నెట్టేస్తూ ఉంటే దీని ప్ర‌భావం కేవ‌లం తెలంగాణ‌, దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంది అని భ‌ట్టి విక్ర‌మార్క బ‌దులిచ్చారు.

ఈ ఏడాది చివ‌రి నాటికి 20 వేల మెగావాట్ల‌కు పైగా డిమాండ్

తెలంగాణలో ఏటా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోందని భట్టి విక్ర‌మార్క‌ తెలిపారు. 2023లో 15 వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండేదని, 2026 సెప్టెంబర్‌ 9 నాటికి 19 వేల మెగావాట్లకు డిమాండ్‌ పెరిగిందన్నారు. ఈ ఏడాది చివరినాటికి 20 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌కు ప్రోత్సాహం

పారిశ్రామిక వృద్ధి, ప్రజల వినియోగ శక్తి పెరగడం మూలంగా డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. అందుకే వినియోగానికి తగినట్లు విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. సౌర, ఫ్లోటింగ్‌ సోలార్, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయి. దీనిపై త్వరలో స్పష్టంగా ప్రకటన చేస్తామ‌ని భ‌ట్టి పేర్కొన్నారు.

రైతుల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోం

రైతుల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్‌ వ్యవస్థలో లోపాల సవరణకు వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. లోపాలు సరిచేసుకోకుండా విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ చేయలేమన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ స్కీమ్‌ కింద కేంద్రం 60 శాతం గ్రాంటు ఇస్తుందని, మిగతా 40 శాతం రాష్ట్రం భరిస్తే ఎంత విద్యుత్ డిమాండ్‌ ఉన్నా ఇబ్బంది ఉండదన్నారు.

Advertisement
Advertisement