త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajanna Sircilla | సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు

Rajanna Sircilla | ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

P

Telangana | Published On Sep 26, 2026, 5.41 pm IST

Rajanna Sircilla | సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు
Advertisement

Rajanna Sircilla | ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు సిరిసిల్ల రగుడు బైపాస్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనితో కలిసి తుమ్మల సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గితే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు అధికారులు ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని తుమ్మల అన్నారు. ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా సేవలు అందించాలని సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములై.. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి తుమ్మల పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement