CM Revanth Reddy | ఎస్సీ వర్గీకరణ అమలులో నాది కర్ణుడి, బర్బరీకుడి పాత్ర.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | ఎస్సీ వర్గీకరణ అమలులో నాది మహాభారతంలోని కర్ణుడి, బర్బరీకుడి పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. బలహీనులైన మాదిగ జాతి పక్షనా నిలబడాలని చెప్పి.. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ముందున్నది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం మీది..
మీరు కష్టపడితేనే ప్రజాపాలన వచ్చింది..
మీ న్యాయమైన హక్కు కోసం మీతో పాటు నడిచాను..
ఎస్సీ వర్గీకరణపై వాయిదా తీర్మానం పెడితే బయటకు గెంటేశారు..
వర్గీకరణ అమలులో మిత్రధర్మం పాటించాను..
మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్‌లో సీఎం రేవంత్
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఎస్సీ వర్గీకరణ అమలులో నాది మహాభారతంలోని కర్ణుడి, బర్బరీకుడి పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. బలహీనులైన మాదిగ జాతి పక్షనా నిలబడాలని చెప్పి.. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ముందున్నది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ సమీపంలోని శిల్పా కళా వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు.
ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం మీరందరూ కోరుకుంటే, ప్రజా పాలన రావాలి.. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి అని ఒక బలమైన ఆకాంక్షతో 2023లో జరిగిన ఎన్నికల్లో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర గానీ, దామన్న దగ్గర గానీ, లక్ష్మణ్ దగ్గర గానీ, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్ వద్ద అధికార యంత్రాంగం లేదు. అక్రమ సంపాదన లేదు. ఎన్నికల్లో గెలవాలి అంటే అగమ్య గోచర పరిస్థితి. అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారు ఒక వైపు, ఏ విధంగానైనా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మీరందరూ అండగా నిలబడితే ప్రజా పాలన ఏర్పడింది. మాటలతో, మూటలతో గెలవలేదు. చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కారించాలన్న ఆలోచనతో ముందకు వచ్చాం కాబట్టి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మీ న్యాయమైన హక్కు కోసం మీతో పాటు నడిచాను..
ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని ముందుంచారు. కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు పోయాయి. ఎస్సీ వర్గీకరణ సాధించాలని చెప్పి, మాకు మనుగడ లేదని చెప్పి ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, నివేదికలు తర్జనభర్జనలు.. వాటి మీద న్యాయస్థానం ముందు సమీక్ష పెట్టి.. రెండు అడుగులు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసే పరిస్థితి. ప్రజాజీవితంలో ఉన్నప్పటి నుంచి ఈ సమస్యను చూస్తూనే వస్తున్నా. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో చేతనైన సహకారాన్ని అందిస్తూ వచ్చాను. సమావేశాలు పెట్టినప్పుడు, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు, సమావేశాలను విజయవంతం చేయాలనుకున్నప్పుడు మందకృష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా వద్దకు వస్తే అండగా నిలబడి.. మీ న్యాయమైన హక్కు కోసం మీతో పాటు నడిచాను అని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ..
ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్‌తో పాటు తనను సభ నుంచి బయటకు గెంటేశారు. సంపత్‌కుమార్, సండ్ర వెంకట వీరయ్యకు పేగు బంధం ఉండొచ్చు లేదా ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరు ఎందుకు మాకు అండగా నిలబడ్డారని ఆలోచన చేయొచ్చు. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదచలుకున్నా.. మహాభారతంలో ఒక్కొక్కరిది గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు, కృష్ణుడు నచ్చొచ్చు. మహాభారతంలో కర్ణుడు, బర్బరీకుడు అనే పాత్ర ఉంది.. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డడు. కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడ్డాను. మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడ్డాను. రెండో పాత్ర.. బర్బరీకుడు.. చాలా మందికి ఈ పాత్ర తెలియదు. భీమసేనుడు కుమారుడు ఘటోత్కచుడు.. ఈయన కొడుకు పేరు బర్బరీకుడు.. ఈయన ప్రత్యేకత ఏంటంటే బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే గొప్ప లక్షణం. యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే.. న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బర్బరీకుడు. న్యాయం మీ వైపు ఉందని బలహీనుల పక్షాన ఉండి కొట్లాడాలని పోరాడాను. మీ పక్కన నేను ఉండకపోతే న్యాయం జరగదని చెప్పి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఒక ప్రయత్నం చేశాను. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి.. మాదిగ, మాదిగ ఉపకులాలకు వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత.. ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
మాదిగ జాతి నాకు అండగా నిలబడాలి..
వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోచ్చు.. ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు, లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవడం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు.. ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. వెనుక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి అని సీఎం కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



