KTR | ఇంకెవరో టీఆర్ఎస్‌ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్
KTR | టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) తో మాకు 22 ఏళ్ల అనుబంధం ఉందని, ఈ నేపథ్యంలో బంధం కంటే పార్టీనే ముఖ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మా క్రెడిబిలిటీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) తో మాకు 22 ఏళ్ల అనుబంధం ఉందని, టీఆర్ఎస్ మా క్రెడిబిలిటీ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
బంధం కంటే పార్టీనే ముఖ్యం
22 సంవత్సరాలు కష్టపడి పార్టీని నిర్మించి, రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చాం. రాజకీయంగా మా పార్టీకి నష్టం కలగాలని చూస్తే ఎందుకు ఊరుకుంటాం. ఇంకెవరో ఆ పేరును తీసుకుంటాం అంటే ఎవరు ఒప్పుకుంటారు.. ఉద్దేశపూర్వకంగా నష్టం చేస్తామంటే ఎలా ఊరుకుంటాం. బంధం కంటే పార్టీనే ముఖ్యం. టీఆర్ఎస్ పార్టీ పేరును ఆరు సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది అని ఆయన తెలిపారు.
నన్ను హరీష్ రావునే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు..
వచ్చే ఏడాది తెలంగాణలో పాదయాత్ర చేస్తాను. మా ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. పార్టీ కంటే ఎవరు పెద్దవాళ్లు ఉండరు. పెద్దవాళ్ళు అనుకుంటే మేమేం చేయలేం. ఎవరి ఎజెండాలు వాళ్ళవే. వాళ్ల ఆశయాలు వేరు. కేసీఆర్ వచ్చేటప్పుడు వస్తారు. నన్ను హరీష్ రావునే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ప్రజల దృష్టి మరల్చడంలో సీఎం నాలుగైదు పీహెచ్‌డీలు చేశారు. అధికారంలోకి వచ్చి 31 నెలల తర్వాత కూడా ప్రతిరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్‌ను చచ్చిన శవం అంటడు. మరి ఎందుకు పదేపదే ప్రతిరోజు విమర్శిస్తున్నారు..? అని కేటీఆర్ నిలదీశారు.
నాలుగు సర్వేల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేలింది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. నాలుగు సర్వేలు చేస్తే అందులో అన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయని తేలింది. తెలంగాణ తల్లి కాస్తా కాంగ్రెస్ తల్లి అయింది.. అధికారంలోకి వచ్చాక కచ్చితంగా కాంగ్రెస్ తల్లిని తీసేస్తాం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జులై 15, 2026

Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్
జులై 15, 2026

CM Revanth Reddy | టీచర్ల బదిలీలు అత్యంత కఠినం.. వారికి ఆ తెలివితేటలు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి
జులై 15, 2026
తాజావార్తలు
- ●KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ●Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
- ●Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్
- ●CM Revanth Reddy | టీచర్ల బదిలీలు అత్యంత కఠినం.. వారికి ఆ తెలివితేటలు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Madhapur Youth Murder | కత్తులతో పొడిచి.. మాదాపూర్లో వరంగల్ యువకుడి దారుణ హత్య.. 'పరువు' కోసమే బలితీసుకున్నారా?
- ●CM Revanth Reddy | సిరాజుద్దీన్కు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు.. అయినా డీఎస్పీ జాబ్ ఇచ్చాం : సీఎం రేవంత్

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!

Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్

CM Revanth Reddy | టీచర్ల బదిలీలు అత్యంత కఠినం.. వారికి ఆ తెలివితేటలు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి



