త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao Letter to Uttam Kumar Reddy | మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ద్ద‌ అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్త‌మ్‌కు హ‌రీశ్‌రావు బ‌హిరంగ‌ లేఖ‌

Harish Rao Letter to Uttam Kumar Reddy | కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ (Mallanna Sagar Project) భద్రతకు ముప్పు కలిగించేలా జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను (Blasting works) తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 30, 2026, 5.33 pm IST

Harish Rao Letter to Uttam Kumar Reddy | మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ద్ద‌ అక్రమ బ్లాస్టింగ్ పనులు ఆపండి.. ఉత్త‌మ్‌కు హ‌రీశ్‌రావు బ‌హిరంగ‌ లేఖ‌
Advertisement

Harish Rao Letter to Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 50 టీఎంసీల కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ (Mallanna Sagar Project) భద్రతకు ముప్పు కలిగించేలా జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను (Blasting works) తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రిజర్వాయర్‌కు ఎలాంటి నష్టం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని అనుమతులు పొందిన తర్వాతే పంప్‌హౌస్ పనుల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈమేర‌కు శుక్ర‌వారం నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి ఆయ‌న బ‌హిరంగ‌ లేఖ రాశారు.

ఇవీ లేఖ వివ‌రాలు..

  • 60 మీటర్ల ఎత్తు ఉన్న మల్లన్న సాగర్ కట్ట నుంచి 600 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు, పేలుళ్లు జరపకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి.. మూసీ పంప్‌హౌస్ కోసం కట్టకు కేవలం 200 మీటర్ల దూరంలోనే భారీ బ్లాస్టింగులు జరపడం అత్యంత ప్రమాదకరం
  • ప్రస్తుతం 12.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ఈ రిజర్వాయర్ కట్టకు బ్లాస్టింగుల వల్ల ఏదైనా నష్టం వాటిల్లితే 60 గ్రామాల ప్రజల భద్రతతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 18 లక్షల ఎకరాల సాగునీటి ప్రయోజనాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు ప్రమాదంలో పడతాయి
  • తక్షణమే ఈ బ్లాస్టింగ్ పనులను నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి
  • బీఆర్ఎస్‌ హయాంలో 90 శాతం పూర్తయిన మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో.. న్యాయస్థానం ఆదేశాల మేరకు మిగిలిన 10 శాతం ప్రయోజనాలు, పెండింగ్ ప్లాట్లను తక్షణమే కేటాయించి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలి
  • మల్లన్న సాగర్ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించి రిజర్వాయర్‌కు ఎలాంటి నష్టం జరిగినా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్:

Blasting WorksHarish RaoLetterTelanganaUttam Kumar Reddy
Advertisement
Advertisement