త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPSC | సివిల్ స‌ర్వీసెస్ ఫ‌లితాలు.. స‌త్తా చాటిన తెలంగాణ అభ్య‌ర్థులు

UPSC | సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

S

Telangana | Published On Mar 6, 2026, 7.53 pm IST

UPSC | సివిల్ స‌ర్వీసెస్ ఫ‌లితాలు.. స‌త్తా చాటిన తెలంగాణ అభ్య‌ర్థులు
Advertisement

UPSC | త్రినేత్ర‌.న్యూస్ : సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్​ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది.

రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వీరిలో 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement