త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి.. ఉన్న‌తాధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు

CM Revanth Reddy | ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులంతా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమ‌న్వ‌యంతో ప‌ని చేసిన‌ప్పుడే ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌చివాల‌యంలో అన్ని విభాగాల సెక్ర‌ట‌రీల‌తో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.

S

Telangana | Published On Dec 23, 2025, 6.23 pm IST

CM Revanth Reddy | స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి.. ఉన్న‌తాధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులంతా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమ‌న్వ‌యంతో ప‌ని చేసిన‌ప్పుడే ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌చివాల‌యంలో అన్ని విభాగాల సెక్ర‌ట‌రీల‌తో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుతో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నాం. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. రాష్ట్రాన్ని క్యూర్ ( CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళుతున్నామ‌ని రేవంత్ తెలిపారు.

ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి. ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారు. కార్యదర్శులు సీఎస్ కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలి. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై నేనే స్వయంగా సమీక్ష నిర్వహిస్తా. శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు. సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకం. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.

ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26 లోగా సీఎస్‌కు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హెచ్‌వోడీలు వెరిఫై చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement