త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌వాసులు..

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు-2026లో పాల్గొనేందుకు ఆయన దావోస్‌కు చేరుకున్నారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆయ‌న‌కు తెలంగాణ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.

S

Telangana | Published On Jan 20, 2026, 11.24 am IST

CM Revanth Reddy | దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌వాసులు..
Advertisement

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు-2026లో పాల్గొనేందుకు ఆయన దావోస్‌కు చేరుకున్నారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆయ‌న‌కు తెలంగాణ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు, సమాచార-ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు-వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు.

దావోస్‌లో మొదటి రోజు ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 రోడ్‌మ్యాప్‌ను ప్రపంచ స్థాయిలో ప్రచారం చేసేలా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. దావోస్ 2026 వేదికగా తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి, భ‌విష్య‌త్ విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రపంచ నేతలు, కార్పొరేట్ అధినేతలు, పరిశ్రమల‌ ప్రతినిధుల ఎదుట ప్రదర్శించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా, వచ్చే దశాబ్దాల్లో రాష్ట్రం అనుసరించనున్న అభివృద్ధి వ్యూహాన్ని వివరించి, తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement