త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

P

Telangana | Published On Sep 25, 2026, 8.29 pm IST

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె 131వ జయంతి సందర్భంగా ఐలమ్మకు సీఎం ఘన నివాళులర్పించారు. దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై ఐలమ్మ పోరాటానికి జంగ్‌ సైరన్‌ మోగించారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.

బీసీలు, పేదలు, మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం

ఐలమ్మ స్ఫూర్తితో బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు గురుకులాలు, హాస్టళ్లలో వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని వివరించారు. సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మరించుకున్నామని చెప్పారు. తెలంగాణ వీర మహిళలు ప్రదర్శించిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement