త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad Airport Development | తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అన్ని వసతులు ఉండాలి : కేంద్ర మంత్రికి రేవంత్ రిక్వెస్ట్

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఆదిలాబాద్‌లో కార్గో, హ్యాంగర్ వసతులతో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేయాలని వినతి. పూర్తి వివరాలు ఇవే.

J

Telangana | Published On Jun 22, 2026, 4.14 pm IST

Adilabad Airport Development | తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అన్ని వసతులు ఉండాలి : కేంద్ర మంత్రికి రేవంత్ రిక్వెస్ట్
Advertisement
  • ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగర్ వసతులతో భారీగా అభివృద్ధి చేయాలని వినతి
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో (DRDO) ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి
  • హైదరాబాద్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు

Adilabad Airport Development | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో (Rajnath Singh) సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ (Adilabad Airport) అభివృద్ధి, దేవరకద్రలో డీఆర్‌డీవో ప్రాజెక్టు ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఫుల్ సపోర్ట్

ఆదిలాబాద్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్ట్‌ను అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. దేశ భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ), యూటిలిటీస్ బదలాయింపు వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి సీఎం హామీ ఇచ్చారు.

CM Revanth Reddy Meets Rajnath Singh for Adilabad Airport Development

కార్గో, ఎంఆర్‌వో (MRO) వసతులు

కేవలం మిలటరీ అవసరాలకే కాకుండా, పౌర విమానయాన శాఖకు చెందిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌తో పాటు.. ఇక్కడ భారీ ఎత్తున కార్గో (Cargo), ఎంఆర్‌వో (MRO - Maintenance, Repair, Overhaul), హ్యాంగర్ (Hangar) సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో (Middle East) ఇటీవల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పలు ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సేఫ్ అయిన హ్యాంగర్స్ కోసం వెతుకుతున్నాయని.. ఇందుకు ఆదిలాబాద్ బెస్ట్ ఆప్షన్ అని వివరించారు.

దేవరకద్రలో డీఆర్‌డీవో ప్రాజెక్టు

మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో (DRDO) తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని, దీనికి వెంటనే ఫైనల్ అప్రూవల్ (మంజూరు) ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు.

అలాగే, ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం డిఫెన్స్ ల్యాండ్స్‌ను (రక్షణ శాఖ భూములు) రాష్ట్రానికి బదలాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement