త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం: సీఎం రేవంత్‌

Revanth Reddy | రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు అవసరం ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ విమానాశ్ర‌యాల ప‌నుల‌ను 2028, జూన్ 2 నాటికి పూర్తిచేసి, ప్రారంభించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు.

G

Telangana | Published On Jul 14, 2026, 1.13 pm IST

Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు అవసరం ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ విమానాశ్ర‌యాల ప‌నుల‌ను 2028, జూన్ 2 నాటికి పూర్తిచేసి, ప్రారంభించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టు (Warangal Airport) ఆకృతిలో కాక‌తీయ సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడితో (Rammohan Naidu) స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్ (Adilabad Airport), మామునూరు విమానాశ్రయాల డిజైన్, వసతుల కల్పనపై చర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. రెండు విమానాశ్ర‌యాల అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి అవసరమైన చర్చలు చేపడుతున్నామ‌ని వెల్ల‌డించారు.

అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. దేశ జనాభాలో 2.50 శాతం జనాభా ఉన్న తెలంగాణ 5 శాతం జీడీపీ వాటా కలిగి ఉందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తా తెలిపారు. కాగా, వరంగల్‌ విమానాశ్రయ ప‌నులు మూడు వారాల్లో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. 2 జూన్‌ 2028 నాటికి వరంగల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారని చెప్పారు. దానికినుగుణంగా చర్యలు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. వరంగల్‌ ప్రాంత ప్రజలకు అద్భుతమైన విమానాశ్రయం వస్తుంద‌ని తెలిపారు. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు రావాల్సిన అవసరముందన్నారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామ‌ని, రక్షణశాఖ భూముల వ్యవహారం తేలాక నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు. వీలైనంత త్వరగా భూ సేకరణ పూర్తి చేసి ఆదిలాబాద్‌ విమానాశ్రయం పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అంత‌కుముందు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో (Nitin Gadkari) సీఎం రేవంత్‌ స‌మావేశ‌మ‌య్యారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ ప్రాంతానికి అనుమతులివ్వండి..

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరప్రాంత పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపాలని గ‌డ్క‌రీని సీఎం రేవంత్ కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దక్షిణ ప్రాంతానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ ఆర్ ఉత్త‌ర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని వివరించారు. ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని, హైదరాబాద్-అమరావతి మధ్య 12వ వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement