CM Revanth Reddy | మూసీ నది పేరును ఎవరైనా పెట్టుకుంటున్నారా? : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | తనకు అసహనం, అసంతృప్తి లేకపోవడం వల్ల ఎప్పుడూ ఎనర్జీగా ఉంటానని, సమస్య వచ్చినప్పుడు కొంత మానసిక ఒత్తిడి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వే టూ న్యూస్ కాంక్లేవ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో 51 శాతం ఉంటే గెలుస్తావని తాను నమ్ముతానని, వంద శాతం అనే భావనను తాను కోరుకోనని చెప్పారు.
CM Revanth Reddy | తనకు అసహనం, అసంతృప్తి లేకపోవడం వల్ల ఎప్పుడూ ఎనర్జీగా ఉంటానని, సమస్య వచ్చినప్పుడు కొంత మానసిక ఒత్తిడి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వే టూ న్యూస్ కాంక్లేవ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో 51 శాతం ఉంటే గెలుస్తావని తాను నమ్ముతానని, వంద శాతం అనే భావనను తాను కోరుకోనని చెప్పారు. జూబ్లీహిల్స్ నుంచి గ్రామాల్లోకి వెళ్లానని పేర్కొన్నారు. సినీ, పారిశ్రామిక రంగాల నుంచి గ్రామ స్థాయి వరకు అన్నింటినీ చూశానని తెలిపారు. సంక్షేమం నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధి ప్రణాళిక ప్రకారం జరగాలని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు తరువాత కొనసాగడం లేదని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో జీరో డ్రాప్ అవుట్స్ ఉన్నాయని చెప్పిందని తెలిపారు.
ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చాం..
28 నెలల్లో మహిళల కోసం 10 వేల నిధులు ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చామని, ప్రతి నెల రూ.350 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నామని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌లో 2,554 బస్సులు నడుపుతున్నామని, ఈవీ వాహనాలతో డీజిల్ ఖర్చు తగ్గిస్తున్నామన్నారు. తన రాజకీయ జీవితంలో 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, అప్పటి పాలసీ ఆలోచనలే నేటి తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ అని తెలిపారు. 108 దేశాల ప్రతినిధులతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించినా పట్టించుకోనని చెప్పారు. పేదలకు న్యాయం చేస్తామని, కూలగొట్టిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందిస్తామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ తప్పకుండా సాధ్యం..
మూసీ నది పేరును ఎవరైనా పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ బయట, ఆర్ఆర్ఆర్ లోపల సుమారు 10వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో పెరి అర్బన్ రీజియన్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ తప్పకుండా సాధ్యం చేస్తామని, అక్కడి నుంచి మచిలీపట్నం వరకు కనెక్టివిటీ తీసుకొస్తామని అన్నారు. రియల్ ఎస్టేట్ ఎదుగుదల ఆశించినంతగా లేదని, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా భ్రమలో ఉన్నారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రగ్స్ కంట్రోల్ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూ, అది సరైన విధంగా నిర్మించకపోవడం వల్ల కూలిపోయిందని అన్నారు. విద్య, ఇరిగేషన్ రంగాల్లో నెహ్రూ చేసిన సంస్కరణలు దేశ అభివృద్ధికి తొలి అడుగని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలపై కూడా విమర్శలు చేశారు.
నియోజకవర్గాల పునర్వీభజనపై అభ్యంతరం..
తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత ఆ పదవిలో ఉండబోనని చెప్పారు. జాతీయ స్థాయిలో సేవ చేస్తానని, రాహుల్ గాంధీని ప్రధానిగా కూర్చోబెడతానని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శలు చేస్తూ దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమారుడి కేసు విషయంలో బాధితురాలి ఫిర్యాదు వచ్చిన గంటలోనే పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. ఐదు పోలీస్ టీమ్స్‌తో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. బండి సంజయ్‌కు తక్షణమే తన కుమారుడిని విచారణకు హాజరుపరచాలని సూచించారు. విచారణను ఎదుర్కొంటేనే గౌరవం ఉంటుందని అన్నారు. ప్రభుత్వాన్ని రెండున్నరేళ్లుగా చిన్న తప్పులు లేకుండా నడిపామని, వచ్చిన తప్పులను సవరించుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. తన ఇంటి వద్ద బారీకేడ్లు ఉండవని, ఎవరైనా వచ్చి కలవవచ్చని తెలిపారు. పార్టీలో కింది స్థాయి నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నామని, సామాజిక సేవ చేసిన వారికి అవకాశాలు ఇచ్చామని అన్నారు. మూసీ ప్రక్షాళన తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uppal Elevated Corridor | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెప్పుడు పూర్తవుతుంది : ఏజెన్సీపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
ఆగస్టు 11, 2026

Moon Crater | చంద్రుడిపై కొత్తగా భారీ గొయ్యి.. స్పేస్ఎక్స్ రాకెట్ ఢీకొట్టడంతోనే..!
ఆగస్టు 11, 2026

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు
- ●Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
- ●Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!
- ●Uppal Elevated Corridor | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెప్పుడు పూర్తవుతుంది : ఏజెన్సీపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
- ●Sangareddy Road Accident | నెత్తురోడిన రహదారి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కూలీల దుర్మరణం

Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు

Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!



