త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anganwadi Children | ఇకపై అంగ‌న్‌వాడీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. 

Anganwadi Children | రాష్ట్రంలో అంగ‌న్‌వాడీ విద్యార్థుల (Anganwadi Children) ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ `తొలి ముద్ధ‌` (Tholi Mudda ) ప‌థ‌కాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజూ ఉదయం చిన్నారుల‌కు రుచిక‌ర‌మైన ఉప్మా, కిచిడీ మిక్స్ (రెడీ టూ కుక్‌ఫుడ్‌) వంటి ప‌దార్థాల‌ను అందించ‌నున్నారు.

G

Telangana | Published On Mar 28, 2026, 5.17 pm IST

Anganwadi Children | ఇకపై అంగ‌న్‌వాడీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. 
Advertisement

Anganwadi Children | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో అంగ‌న్‌వాడీ విద్యార్థుల (Anganwadi Children) ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ `తొలి ముద్ధ‌` (Tholi Mudda ) ప‌థ‌కాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజూ ఉదయం చిన్నారుల‌కు రుచిక‌ర‌మైన ఉప్మా, కిచిడీ మిక్స్ (రెడీ టూ కుక్‌ఫుడ్‌) వంటి ప‌దార్థాల‌ను అందించ‌నున్నారు. అసెంబ్లీ ప్రాంగ‌ణ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, సీతా ద‌యాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దేశంలో నిర‌క్ష‌రాస్య‌త‌ను త‌గ్గించేందుకు, వ్య‌వ‌సాయాభివృద్ధికి తొలి ప్ర‌ధాని నెహ్రూ విద్యా, ఇరిగేష‌న్‌కు ప్రాధాన్యం ఇచ్చార‌న్నారు. దేశంలో ఆహార భ‌ద్ర‌త ఉంది.. కానీ, పౌష్టికాహారం మాంత్ర అందడం లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే ప్ర‌భుత్వం బిడ్డ‌లో క‌డుపులో ఉన్న‌ప్ప‌టి నుంచి త‌ల్లికి పౌష్టికాహారం అందిస్తున్న‌దని చెప్పారు. తాజాగా బ్రేక్‌ఫాస్ట్ ప‌థ‌కాన్ని కూడా ప్రారంభించామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఎంత మంచి ప్ర‌ణాళిక‌లు చేసినా, అమ‌లు చేయాల్సింది మాత్రం అంగ‌న్‌వాడీ టీచ‌ర్లేన‌న్నారు. అంగ‌న్‌వాడీ చిన్నారుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాల‌ని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని.. వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అంగన్‌వాడీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, పారదర్శకత కోసం అంగన్‌వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.

‘తొలి ముద్ద’ పథకాన్ని తొలుత హైదరాబాద్‌లోని సుమారు 970 అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. చిన్నారులకు వారానికి ఆరు రోజులు వేడివేడిగా, రుచికరమైన అల్పాహారం అందిస్తారు. మెనూలో దోసె, చపాతీ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, మిల్లెట్ ఉప్మా వంటివి ఉంటాయి. అదనంగా రోజు విడిచి రోజు పాలు, రాగిజావ కూడా అందించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement