త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Holidays | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. సెల‌వులు ప్ర‌క‌టించిన రేవంత్ స‌ర్కార్

Holidays | త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయా రాష్ట్రాల ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది.

S

Telangana | Published On Apr 4, 2026, 7.24 pm IST

Holidays | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. సెల‌వులు ప్ర‌క‌టించిన రేవంత్ స‌ర్కార్
Advertisement

Holidays | త్రినేత్ర‌.న్యూస్ : త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయా రాష్ట్రాల ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కార్మిక‌, ఉపాధి శాఖ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఎన్నికలు జరుగుతున్న అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎవరైతే తెలంగాణలో ఉద్యోగ రీత్యా లేదా ఇతర పనుల నిమిత్తం స్థిరపడ్డారో.. వారందరికీ తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబ‌డిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగాలకు కూడా వర్తించ‌నుంద‌ని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు, ఉద్యోగులకు పోలింగ్ రోజున ‘పెయిడ్ హాలిడే’ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగుల జీతంలో ఎటువంటి కోత విధించకూడదని యాజమాన్యాలకు సూచనలు జారీ అయ్యాయి.

అసోం, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఓటర్ల కోసం ఏప్రిల్ 9వ తేదీన సెలవు ప్రకటించారు. తమిళనాడు ఓటర్ల కోసం ఏప్రిల్ 23వ తేదీన ప్రత్యేక సెలవు వర్తించనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వివిధ దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, అక్కడి ఓటర్ల కోసం ఏప్రిల్ 23, 29 తేదీల్లో సెలవులను ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement