త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నీ చ‌దువేందో.. నా చ‌దువేందో స‌భ‌లో తేల్చ‌కుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ స‌వాల్

CM Revanth Reddy | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద‌గా చ‌దువు రాద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీ చ‌దువేందో.. నా చ‌దువేందో స‌భ‌లో తేల్చుకుందాం అని కేటీఆర్‌కు స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Sep 5, 2026, 7.46 pm IST

CM Revanth Reddy | నీ చ‌దువేందో.. నా చ‌దువేందో స‌భ‌లో తేల్చ‌కుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ స‌వాల్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద‌గా చ‌దువు రాద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీ చ‌దువేందో.. నా చ‌దువేందో స‌భ‌లో తేల్చుకుందాం అని కేటీఆర్‌కు స‌వాల్ విసిరారు. న‌కిరేక‌ల్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు.

రేవంత్‌కు పెద్ద‌గా చ‌దువు రాద‌ని ఇవాళ ఎక్క‌డో అన్న‌డంట‌.. నాకు చ‌దువు వ‌స్త‌దో రాదో కాని రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంది. నాకు సంస్కారం ఉంది కాబ‌ట్టే.. ఇప్ప‌టికి మిమ్మ‌ల్ని చింత‌బ‌రిగె తీసుకుని ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తాలో నిల‌బెట్టి కోదండం వేసి కొట్ట‌కుండా ఆపింది. అందుకే బ‌రితెగించి బ‌ద్మాష్‌లాగా మాట్లాడుతున్నారు. రేవంత్‌కు సంస్కారం లేక‌పోతే ఒక్కడు కూడా రోడ్డు మీద కాలు బెట్ట‌డు.. ఫామ్ హౌజ్‌లో బొర్లా బొక్క‌లో ప‌డుకోవాలి అని సీఎం అన్నారు.

సీత‌క్క‌ను, కొండా సురేఖ‌ను గౌర‌వించిన‌

సీత‌క్క‌, కొండా సురేఖ ఇంటికి వ‌స్తే స్వీట్ తినిపించి రాఖీ క‌ట్టుకుని ఆడ‌బిడ్డ‌ల‌కు గౌర‌వం ఇచ్చిన‌.. నీ సొంత చెల్లెలు రాఖీ క‌డుతానంటే ఆస్తిలో వాటాలో ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని ర‌క్తం పంచుకుని తోడ‌బుట్టిన చెల్లెల్ని మెడ‌బ‌ట్టి గెంటేసిన నీచుడా, నికృష్టుడా, గాడిదా.. నీకు నాకు పోలికా..! నాలుగు ఇంగ్లీష్ ముక్క‌లు వ‌స్తే గొప్పోనివి అయిన‌వా..? అమెరికాలో బాత్రూమ‌ల్ క‌డిగిన‌వ్.. ఇక్క‌డ వ‌స్తే హోట‌ల్‌లో ప‌ని చేసిన‌వ్.. అని రేవంత్ విమ‌ర్శించారు.

నీ అయ్య‌ను, నీ బావ‌ను తీసుకురా.. స‌మాధానం చెబుతా

మ‌నం ఇక్క‌డ హోట‌ల్‌కు వెళ్తే.. వాట్ కెన్ ఐ డూ ఫ‌ర్ యు స‌ర్ అని వ‌స్త‌రు.. అంత‌మాత్రాన ఆయ‌న సైంటిస్టు అయిత‌డా.. గుంటూరులో చ‌దివి ఆ తెలివితేట‌లు చూపిస్తున్నాడు.. నీకు తెలంగాణ‌లో చ‌ప్రాసీ నౌక‌రి కూడా ఇవ్వొద్దు.. కానీ ప్ర‌జ‌లు నిన్ను న‌మ్మితే.. న‌మ్మితిరా సిద్ద పెడితిరా సున్నం అన్న‌ట్టు బందీపోట్ల మాదిరి తెలంగాణ‌ను దోచుకుతిన్నారు. నా చ‌దువు గురించి మాట్లాడుతావా..? నీకు సంస్కారం ఉందా.. రా.. స‌భ‌లో మాట్లాడుదాం. నీ చ‌దువేందో.. నా చ‌దువేందో.. నీ సంస్కార‌మేందో.. నా సంస్కార‌మేందో మాట్లాడుదాం.. నీతో ఎట్లాగు కాదు.. చర్చ స‌మ‌యానికి గంజాయి కొట్టి పండుత‌వ్.. నీ అయ్య‌ను, నీ బావ‌ను తీసుకురా.. స‌మాధానం చెబుతా స‌భ‌లో. మ‌ర్యాద‌గా ఉంటే చేత‌గాని త‌నం అనుకుంటున్న‌రేమో.. మా కార్య‌క‌ర్త‌లు అన్న‌ట్టు.. సార్ అది పాము.. తోక తొక్క‌కు.. ప‌డ‌గ మీద కొట్టు అని అన్న‌రు. కోర‌లు పీకినం క‌దా దానితో అయ్యేది ఏముందేలే అన్న‌ను. కార్య‌క‌ర్త‌లు చెప్పింది నిజ‌మే అనిపిస్తుంది. సంస్కారం ఉన్న పార్టీ ఇది అని రేవంత్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement