Tr Prefix For Teachers | డాక్టర్లకు ‘Dr.’, ఇంజనీర్లకు ‘Er.’.. మరి టీచర్లకు? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్ల తరహాలోనే టీచర్లు కూడా తమ పేరు ముందు గౌరవప్రదంగా 'Tr.' అని పెట్టుకోవచ్చు.
- ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక ప్రకటన
- డాక్టర్లు, ఇంజనీర్ల తరహాలోనే ఉపాధ్యాయులు తమ పేరు ముందు 'Tr.' (టీచర్) అనే అక్షరాలను జోడించుకునే అవకాశం
- రెండు అక్షరాలే అయినా, ఇది సమాజం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన గురువులకు దక్కే అరుదైన గుర్తింపు అని ఎక్స్‌లో వెల్లడి
Tr Prefix For Teachers | త్రినేత్ర.న్యూస్ : దేశాన్ని నిర్మించే ప్రతి ఒక్కరినీ తయారు చేసేది ఉపాధ్యాయులే (Teachers). అలాంటి గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ అరుదైన కానుకను ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ సగర్వంగా తమ పేరు ముందు 'Tr.' (Tr. Prefix) అని పెట్టుకునే అవకాశాన్ని కల్పించారు.
భారతదేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా.. ఒక్క కర్ణాటకలోనే దాదాపు 4.5 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రతిరోజూ మన పిల్లల భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రాణాలు నిలిపే డాక్టర్ (Doctor), దేశాన్ని నిర్మించే ఇంజనీర్ (Engineer), అన్నం పెట్టే రైతు, సేవలు అందించే ఆఫీసర్, కొత్త ఆవిష్కరణలు చేసే వ్యాపారవేత్త, దారి చూపే నాయకుడు.. వీరందరి వెనుకా ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. వారి టాలెంట్‌ను ముందుగా గుర్తించి, వాళ్లకు దారి చూపేది ఆ గురువులే.
ఉపాధ్యాయులు చేస్తున్న ఈ అమూల్యమైన సేవకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కర్ణాటకలోని టీచర్లు తమ పేరు ముందు "Tr." అనే అక్షరాలను గౌరవ సూచకంగా వాడుకోవచ్చు. ఈ "Tr." అనేది కేవలం రెండు అక్షరాలు కాదు, ఇతరుల జీవితాలను తీర్చిదిద్దడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి సమాజం ఇచ్చే అరుదైన గుర్తింపు, టైటిల్ (Title) అని సీఎం డీకే శివకుమార్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.
గురువులను గౌరవించే సమాజం, తన భవిష్యత్తును తానే గౌరవించుకున్నట్లు అని ఆయన అన్నారు. దారి తప్పినప్పుడు సరిదిద్ది, మన కలలకు ప్రోత్సాహం అందించి, మనల్ని మనకంటే ఎక్కువగా నమ్మిన ప్రతి ఉపాధ్యాయుడికి కర్ణాటక సెల్యూట్ చేస్తోందని ట్వీట్ చేశారు. "మా పిల్లలను తీర్చిదిద్దుతున్నందుకు, కర్ణాటకను.. భారతదేశాన్ని నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు. 'Tr.' అనేది మీరు నిజంగా సంపాదించుకున్న గౌరవం" అంటూ ఆయన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
A teacher builds every person who goes on to build the nation.
India’s more than one crore teachers, including nearly 4.5 lakh teachers in Karnataka, are shaping the minds, character and future of our children every single day.
Every doctor who heals, engineer who builds,… pic.twitter.com/hQecWpPSWB
— DK Shivakumar (@DKShivakumar) September 5, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Malayalam OTT | హీరోయిన్గా మోహన్‌లాల్ కూతురు - ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
- ●CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
- ●HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
- ●Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి
- ●Thalapathy Vijay Father | కొత్త కారు కొన్న దళపతి విజయ్ తండ్రి - పెళ్లి రోజు గిఫ్ట్

Malayalam OTT | హీరోయిన్గా మోహన్‌లాల్ కూతురు - ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్

CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్




