త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గ‌ల్లీలో మోరి తీయాలంటే మోదీని అడగ‌ల్నా..? : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఎనిమిది మంది ఎంపీలు గెలిచి.. ఇద్ద‌రు కేంద్ర మంత్రులుగా ఉండి.. తెలంగాణ‌కు ఒక్క రూపాయి ప‌ని అయినా తీసుకొచ్చారా..? అని రేవంత్ నిల‌దీశారు. రేపు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపోళ్లు గెలిస్తే.. గ‌ల్లీలో మోరి తీయాలంటే.. ఢిల్లీ వెళ్లి మోదీ అడ‌గల్నా..? అని సీఎం ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Feb 6, 2026, 7.18 pm IST

CM Revanth Reddy | గ‌ల్లీలో మోరి తీయాలంటే మోదీని అడగ‌ల్నా..? : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

బీజేపీ ఎంపీలు ఒక్క రూపాయి తెచ్చారా..?
మోదీ వ‌ద్ద అర‌వింద్ ప‌ర‌ప‌తి ప‌ని చేయ‌లేదా..?
కిష‌న్ రెడ్డి కిష‌న్ రావుగా మారిండు..
రేవంత్ ఉద్దీన్ అన్న‌ నాకేం ప్రాబ్లం లేదు..
ఒక్క త‌ల‌కాయ త‌గ్గినా నా త‌ల తీసుకుంటా..
బీజేపీ, బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ధ్వ‌జం

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారు. ఎనిమిది మంది ఎంపీలు గెలిచి.. ఇద్ద‌రు కేంద్ర మంత్రులుగా ఉండి.. తెలంగాణ‌కు ఒక్క రూపాయి ప‌ని అయినా తీసుకొచ్చారా..? అని రేవంత్ నిల‌దీశారు. రేపు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపోళ్లు గెలిస్తే.. గ‌ల్లీలో మోరి తీయాలంటే.. ఢిల్లీ వెళ్లి మోదీ అడ‌గల్నా..? అని సీఎం ప్ర‌శ్నించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని బ‌ద్రిప‌ల్లిలో ఏర్పాటు చేసిన ప్ర‌జా పాల‌న - ప్ర‌గ‌తి బాట బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

నిజామాబాద్ జిల్లాకు గొప్ప చ‌రిత్ర ఉంది. నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ అని నిన‌దించిన దాశ‌ర‌థి ఈ నిజామాబాద్ గ‌డ్డ మీద పుట్టిన బిడ్డ‌. ఇక్క‌డి జైల్లో నుంచి ఆనాడు ఆ నినాదం అందించారు. అలాంటి గ‌డ్డ‌మీద మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విల‌క్ష‌ణ‌మైన తీర్పు ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. 2014, 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మోదీ మూడుసార్లు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. ఈ పార్టీలు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి ఉంటే నిజామాబాద్ మురికి కూపంగా ఉండేది కాదు. వీరు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోగా మ‌రింత జ‌ఠిలం అయ్యాయి. ఈ జిల్లా వ్య‌వ‌సాయానికి మారుపేరుగా నిలిచింది. అంకాపూర్ చికెన్ దేశంలోనే ప్ర‌ఖ్యాతిగాంచింది. నిజామాబాద్ ప‌సుపు బంగారంతో పోటీ ప‌డుత‌ది. ఈ జిల్లాలో చెరుకు, ప‌సుపు, వ‌రి ధాన్యం పండించే రైతులు దేశానికే ఆద‌ర్శ‌మ‌ని రేవంత్ పేర్కొన్నారు.

నిజామాబాద్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొస్తా..

వైఎస్సార్, డీఎస్ నాయ‌క‌త్వంలో 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 2023 ఎన్నిక‌ల్లో నేను పీసీసీ అధ్య‌క్షుడిగా, మ‌హేశ్ కుమార్ గౌడ్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. మ‌ళ్లీ 2028 ఎన్నిక‌ల్లో సీఎంగా నేను, పీసీసీ అధ్య‌క్షుడిగా మ‌హేశ్ కుమార్ గౌడ్ క‌లిసి పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకువ‌స్తాం. నా మ‌న‌సులో నిజామాబాద్ జిల్లాకు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఈ జిల్లాలోని ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డానికి అద‌నంగా నిధులు మంజూరు చేయ‌డానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేస్తాను. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం స‌హ‌క‌రిస్తాను. నిజామాబాద్ యూనివ‌ర్సిటీలో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్ కాలేజీ ఇచ్చాం. రూ. 600 కోట్ల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసుకున్నాం. బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద‌, ఆర్మూర్, భీంగ‌ల్, బోధ‌న్ మున్సిపాలిటీలు, నిజామాబాద్ కార్పొరేష‌న్ కావొచ్చు.. రూ. 1045 కోట్లతో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టుకుంటున్నాం. నిజామాబాద్‌కు ఔట‌ర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు తీసుకొచ్చే బాధ్య‌త నాది అని సీఎం స్ప‌ష్టం చేశారు.

మోదీ వ‌ద్ద అర‌వింద్ ప‌ర‌ప‌తి ప‌ని చేయ‌లేదా..?

నిజామాబాద్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ను రెండుసార్లు గెలిపించారు. ఆయ‌న ఇవాళ మోదీ మంత్రం చ‌దువుతుండు. గ‌ల్లీలో కౌన్సిల‌ర్ కావాల‌న్నా.. గ‌ల్లీలో మోరి తీయాల‌న్నా ఢిల్లీకి వెళ్లి మోదీని అడ‌గ‌ల్నా..? ఈ విష‌యంపై ప్ర‌జ‌లు ఆలోచించాలి. అర‌వింద్ ఈ ఏడేండ్ల‌లో ఏం తీసుకొచ్చిండో లెక్క చెప్పాలి. మోదీ వ‌ద్ద ప‌ర‌ప‌తి ఉంటే ఎందుకు నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించ‌లేదు..? మీ ప‌ర‌ప‌తి ప‌ని చేయ‌లేదా..? నిజామాబాద్‌కు ఎందుకు ఎయిర్‌పోర్టు మంజూరు చేయ‌లేదు. మెట్రో విస్త‌ర‌ణ‌కు, మూసీ అభివృద్ధికి ఎందుకు నిధులు తీసుకురాలేదు. నిజామాబాద్‌కు ఔట‌ర్ రింగ్ రోడ్డు, దానికి నిధులు తీసుకువ‌స్తామంటే మేం వ‌ద్దాంటామా..? రాష్ట్రానికి ఏం తీసుకొచ్చార‌ని, ఏం ఇచ్చార‌ని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు..? అని ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ను రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

కిష‌న్ రావుగా మారిన కిష‌న్ రెడ్డి

కేసీఆర్, హ‌రీశ్‌రావు, కేటీఆర్‌ను జైల్లో పెట్టి చిప్ప‌కూడు తినిపించాల‌ని అర‌వింద్ మాట్లాడుతాడు. కానీ ఇంత వ‌ర‌కు ఎందుకు అరెస్టు చేయ‌లేదు. మేం కాళేశ్వ‌రంపై సీబీఐ విచార‌ణ కోరితే.. ఎందుకు ఆపుతున్నారు. కేసీఆర్‌కు దొంగ పుత్రుడు కేటీఆర్.. ద‌త్త పుత్రుడు కిష‌న్ రెడ్డి. ఇవాళ కిష‌న్ రెడ్డి కిష‌న్ రావుగా మారి కేసీఆర్‌ను కాపాడుతున్నాడు. ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలి. కిష‌న్ రెడ్డిని జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి తీసుకురావాలని కోరుతున్నాను. మీకు ప‌ర‌ప‌తి ఉంటే నిజామాబాద్ కార్పొరేష‌న్‌ను స్మార్ట్ సిటీలో ప్ర‌క‌టించండి. గాడిద‌కు గ‌డ్డేసి ఆవుకు పాలు పిండుతాం అంటే సాధ్య‌మా..? నిధులు ఇవ్వాలంటే మేయ‌ర్, కార్పొరేట‌ర్, కౌన్సిల‌ర్లు మ‌నోళ్లు ఉండాలి కదా..? బ‌స్తీలు అభివృద్ధి చెందాలంటే కార్పొరేట‌ర్ మ‌నోడు గెల‌వాలి. రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వ‌ని బీజేపీని బొంద‌పెట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు.

రేవంత్ ఉద్దీన్ అంటే సంతోష‌ప‌డ్డా..

నిన్న బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు మాట్లాడుతూ.. న‌న్ను రేవంత్ రెడ్డి కాద‌ని రేవంత్ ఉద్దీన్ అని ముస్లిం పేరు మీద పిలిచిండు సంతోషం. వందేండ్ల క్రితం బ్రిటీష్ వారు ఉన్న‌ప్పుడు బీసీ కుల‌గ‌ణ‌న చేశారు. బీసీల లెక్క‌లు తీయ‌లేదు. మేం బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టి వందేండ్ల స‌మ‌స్యకు పరిష్కారం చూపాం. బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టిన త‌ర్వాత‌ మ‌హేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని అన్నారు. నేను సంతోషంగా స్వీక‌రించాను. ఎస్సీ ఉప‌కులాల వ‌ర్గీక‌ర‌ణ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ప్పుడు రేవంత్ మాదిగ అని దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. వాళ్ల జాతిలో న‌న్ను ఒక‌డిగా ప‌రిగ‌ణించినందుకు సంతోష‌ప‌డ్డాను. ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహ‌రికి మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పిస్తే.. రేవంత్ ముదిరాజ్ అంటే సంతోష‌ప‌డ్డాను. సిక్కు సోద‌రులు కూడా న‌న్ను స‌ర్దార్ రేవంత్ సింగ్ అన్నారు. అయినా నాకు అభ్యంత‌రం లేదు. అన్ని కులాల‌ను, మ‌తాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ సంక్షేమ ఫ‌లాలు అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబ‌ర్‌వ‌న్‌గా నిల‌బెడుతాన‌ని సీఎం రేవంత్ అన్నారు.

నా త‌ల‌కాయ తీసుకుంటా..

ఈ రెండేండ్ల కాలంలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఎల్బీ స్టేడియం రా.. త‌ల‌లు క‌ట్టి లెక్క చూపిస్తా.. ఒక్క త‌ల‌కాయ త‌గ్గినా నా త‌ల‌కాయ తీసుకుంటా. 2011 త‌ర్వాత గ్రూప్ -1 ప‌రీక్ష పెట్ట‌కపోతే.. మేం ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఉద్యోగాలిచ్చాం. కానీ బీఆర్ఎసోళ్లు కాళ్ల‌ల్ల క‌ట్టెలు పెట్టి.. లిటిగేష‌న్ పెడితే చెంప ఛెల్లుమ‌నిపించేలా హైకోర్టు తీర్పు ఇచ్చింద‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement