త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | హ‌రీశ్‌రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాలి.. సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీబీఐ విచార‌ణ భ‌యంతో.. హ‌రీశ్‌రావు చెప్పాపెట్ట‌కుండా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని.. ఈ వివ‌రాల‌న్నీ బ‌య‌ట‌పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగ‌డ్డ బ‌రాజ్ సంద‌ర్శ‌న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On Apr 20, 2026, 8.28 pm IST

CM Revanth Reddy | హ‌రీశ్‌రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాలి.. సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌
Advertisement

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీబీఐ విచార‌ణ భ‌యంతో.. హ‌రీశ్‌రావు చెప్పాపెట్ట‌కుండా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని.. ఈ వివ‌రాల‌న్నీ బ‌య‌ట‌పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగ‌డ్డ బ‌రాజ్ సంద‌ర్శ‌న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంశంపై గ‌తంలో సీబీఐ విచార‌ణ చేయాల‌ని కోరామ‌ని.. ఈ విష‌యంలో మ‌ళ్లీ ఇటీవ‌ల లేఖ రాశామ‌న్నారు. దాంతో కేంద్రంలో క‌ద‌లిక వ‌చ్చింద‌ని, ఒక వేళ త‌క్ష‌ణం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌క‌పోతే త్వ‌ర‌లోనే ఆందోళ‌న కార్య‌క్ర‌మాన్ని కాళేశ్వ‌రం నుంచి ప్రారంభిస్తామ‌ని వారికి స‌మాచారాన్ని పంపామ‌న్నారు. దాంతో బెంబేలెత్తి విచార‌ణ‌కు ఆదేశిస్తార‌ని హ‌డావుడిగా హ‌రీశ్‌రావు, వినోద్‌రావు ఢిల్లీకి ప‌రుగెత్తార‌ని ఆరోపించారు.

కాళ్లు ప‌ట్టుకునేందుకు ఢిల్లీకి..

బీజేపీ నేత‌ల కాళ్లు ప‌ట్టుకునేందుకు హ‌రీశ్‌రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని, ఒక ప‌క్క‌న బ్ర‌హ్మాండం బ‌ద్ద‌ల‌వుతుంది.. మాకు జీవ‌న్ టోన్ దొరికింది.. మా కండ‌లు పెరుగుత‌య్‌.. మేం అధికారంలోకి వ‌స్త‌మ ప్ర‌గ‌ల్భాలు పలుకుతున్నార‌ని, అంత‌పెద్ద జీవ‌న్‌టోన్ మీకు దొరుకుతున్న‌ప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు చెప్పాపెట్ట‌కుండా ప‌రుగెత్తాల్సి వ‌చ్చింద‌ని నిల‌దీశారు. మీరు కేసులు, ఇంకోదాని కోస‌మైనా ప్ర‌జ‌ల‌కు ఎందుకు చెప్ప‌లేద‌ని.. రాజ్య‌స‌భ స‌భ్యుడు, శాస‌న‌స‌భ‌లో ఉప నాయ‌కుడు, ముఖ్య‌నేత ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉంటే ర‌హ‌స్యంగా ఎందుకు ఉంచార‌ని ప్ర‌శ్నించారు. మీడియా హ‌రీశ్‌రావు బీజేపీవారిని క‌లిసేందుకు వెళ్తున్నాడ‌ని మీడియా బ‌య‌ట‌ప‌ట్టే వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదంటే మీ ఉద్దేశం ఏంటీ? అన్నారు. ఎంత‌కాలం బీజేపీని ప్ర‌స‌న్నం చేసుకొని సీబీఐ విచార‌ణ జ‌రుగ‌కుండా ఆపుత‌రు? ఈ ర‌కంగా త‌ప్పించుకోవాల‌ని చూడ‌డం, బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాల‌నే ఆలోచ‌న‌ను భ‌విష్య‌త్‌లో చూస్తూ ఊరుకోమ‌న్నారు.

నిర్దిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు..

ప్ర‌భుత్వం నిర్దిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ముందుకు వ‌స్తుంద‌ని, ఒక ప‌క్క ప్రాజెక్టును రిపేర్ చేసుకొని రాష్ట్ర ప్ర‌యోజ‌న‌క‌రంగా ఎలా ముందుకు వెళ్లాలో.. సాంకేతిక ప‌ర‌మైన అంశాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంద‌న్నారు. ప్రాజెక్టుల‌ను రిపేర్ చేసి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా, తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద ఆపిన ప్రాజెక్టుతో శ్రీ‌పాద ఎల్లంప‌ల్లికి.. చేవ‌ళ్ల వ‌ర‌కు నీరు తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేస్తామ‌న్నారు. అప్పుడ‌ప్పుడు ప్రాణ‌హిత చేవెళ్ల లేక‌పోతే నీరు ఎక్క‌డి నుంచి వ‌స్త‌య‌ని హ‌రీశ్‌రావు మాట్లాడుతార‌ని, ఆయ‌న‌కు తెలివి ఉండి మాట్లాడుతుండా? మ‌భ్య‌పెట్టాల‌ని మాట్లాడుండో నాకు తెలియ‌ద‌న్నారు. ఇందులో ప్రాణ‌వాయువు శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి.. ఈ ప్రాజెక్టును హ‌రీశ్‌రావు నిక్క‌ర్ తొడ‌క‌ముందే కాంగ్రెస్ పార్టీ క‌ట్టింది.. ఎస్సారెస్పీని కాంగ్రెస్ క‌ట్టింద‌న్నారు. ఈ రోజు మేడిగ‌డ్డ నుంచి అన్నారం.. అన్నారం నుంచి సుందిళ్ల‌.. సుందిళ్ల నుంచి నీరెత్తి శ్రీ‌పాద ఎల్లంప‌ల్లిలో పోయాల‌ని, కానీ ఎత్తిపోయ‌క‌పోయినా ఎల్లంప‌ల్లి కెపాసిటీ, ఎస్సారెస్పీ నుంచి తెలంగాణలో అత్య‌ధికంగా వ‌రి సాగ‌వుతుంటే మేం ప్రాజెక్టులు క‌ట్టిన ప్రాజెక్టేన‌ని అబ‌ద్ధాలు చెబుతుండ‌ని, చ‌ర్చిద్దామంటే రాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

కేంద్రం మౌనం ఎందుకు?

48గంట‌ల్లో సీబీఐ విచార‌ణ‌కు అనుమ‌తి ఇస్తామ‌న్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉండిపోయింద‌ని రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, లేఖ‌లు రాసిన స్పందించ‌డం లేదు. ప్ర‌ధాని, కేంద్ర హోంమంత్రి ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడల్లా కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వ‌రం ఏటీఎంగా మారంద‌ని, వేల‌కోట్లు కొల్ల‌గొట్టార‌ని మాట్లాడింది నిజం కాదా? అంటూ ప్ర‌శ్నించారు. విచార‌ణ సంస్థ‌ల అధిప‌తులుగా, ప్ర‌ధాని, హోంమంత్రి మాట్లాడి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటే, హ‌రీశ్‌రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న వెనుక ఉద్దేశం ఏంటో ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నారు. హ‌రీశ్‌రావు ఎక్క‌డి ఎక్క‌డికి వెళ్లిండో ఎప్పుకుంటే విచార‌ణ‌కు ఆదేశిస్తాన‌న్నారు.

అవినీతి బ‌య‌ట‌ప‌డ‌కుండా చూసే ప్ర‌య‌త్నం..

ఏ ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన ప్రముఖుల‌ను క‌లిసి ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చి, అవినీతిని కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌ని విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పీసీ ఘోస్ క‌మిష‌న్ కేసు అంటున్నార‌ని.. కోర్టులో వాద‌న‌లు పూర్త‌య్యాయ‌న్నారు. జ‌డ్జిమెంట్ రావాల్సి ఉంద‌ని, ఇప్పుడు న్యాయ‌మూర్తుల‌ను క‌లిసేందుకు ఏం ఉంది? వాదించేందుకే కేసు లేద‌న్నారు. ఏ ర‌కంగా ఢిల్లీలో న్యాయ‌వాదుల‌ను క‌లిశార‌ని.. ఎవ‌రి ముందు వాదిస్తారు? ఎవ‌రిని మేనేజ్ చేస్తున్నారు? ఎవ‌రిని మ‌భ్య‌పెడుతున్న‌రు.. ఎవ‌రి కాళ్లు ప‌ట్టుకుంటున్నారు? ఏం జ‌రుగుతోంది అంటూ నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌ను అమాయ‌కులు అనుకుంటున్నారా? అన్నారు. ఇందులో దోషుల‌ను వ‌దిలేద‌ని, ప్రాజెక్టును గాలికి వ‌దిలేసి ఊరుకునేది లేద‌ని తేల్చి చెప్పారు. అన్ని ర‌కాలుగా రిపేర్లు చేసి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకుంటామ‌ని, ఇందులో దోషుల‌ను శిక్షించేందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తామ‌న్నారు.

Advertisement
Advertisement