త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నీళ్ల విష‌యంలో కేసీఆర్‌, హ‌రీష్‌రావుల‌ను ఉరి తీసినా త‌ప్పులేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | హైద‌రాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నార‌ని, నీళ్ల విష‌యంలో తెలంగాణ‌కు చేసిన అన్యాయానికి వారిద్ద‌రినీ ఉరి తీసినా త‌ప్పులేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో మంత్రులు, అధికారుల‌తో క‌లిసి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించిన రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jan 2, 2026, 9.50 am IST

CM Revanth Reddy | నీళ్ల విష‌యంలో కేసీఆర్‌, హ‌రీష్‌రావుల‌ను ఉరి తీసినా త‌ప్పులేదు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | హైద‌రాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నార‌ని, నీళ్ల విష‌యంలో తెలంగాణ‌కు చేసిన అన్యాయానికి వారిద్ద‌రినీ ఉరి తీసినా త‌ప్పులేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో మంత్రులు, అధికారుల‌తో క‌లిసి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించిన రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నదీజలాల విషయంలో తప్పులు చేసిన వారే ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తున్నారని, సంకుచిత స్వభావంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీటి హక్కుల కోసమ‌ని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కుల కోసం సొంత పార్టీని నాయకులు ఎదిరించార‌ని గుర్తు చేశారు. తెలంగాణకు కావాల్సిన నీటి హక్కుల కోసం, అన్యాయాన్ని సరిదిద్దడం కోసం పని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు సీఎంలు అయ్యాక నీటి పంపకాలు జరిగాయ‌ని, నికర జలాలలో తెలంగాణ‌ 299 టీఎంసీలు,ఏ పీ కి 511 టీఎంసీల నీటి పంపకానికి ఒప్పుకుంటూ కేసీఆర్ అప్ప‌ట్లో సంతకం చేశారని తెలిపారు.

అపోహ‌లు సృష్టించి అబ‌ద్దాల ప్ర‌చారం..

ఏపీకి కృష్ణా జలాలలో శాశ్వత హక్కులు కల్పిస్తూ కేసీఆర్ అవకాశం ఇచ్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను ఏపీ ముందుకు పోనివ్వడం లేదని, పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 79 శాతం, ఏపీ కి 21 శాతం వాటా ఇవ్వాలని తాము వాదిస్తున్నామ‌ని అన్నారు. తెలంగాణకు మొత్తం 555 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. త‌మ‌ వాదనతో ఏపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంద‌ని, తెలంగాణ సమర్ధ వాదనలు వినిపిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబుకి జ‌గ‌న్ లేఖ రాశారని అన్నారు. అన్ని ఎన్నికల్లో ఓటమి తో బీఆర్ ఎస్ మనుగడ కష్టం అని కేసీఆర్ బయటికి వచ్చార‌ని, నీళ్ల పైన వివాదం సృష్టించి రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. ఏపీకి సహకరిస్తున్నారనే అపోహలు సృష్టించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడం వెనుక కమిషన్ల‌ కక్కుర్తి ఉంద‌ని, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడం వల్ల 3 స్టేజ్ లు 5 స్టేజ్ లకు, 22 పంపులు 37 కి, రూ.32 వేల కోట్ల అంచనాలు రూ.84 వేల కోట్లకి చేరాయ‌న్నారు.

విష‌యం బ‌య‌ట ప‌డుతుంద‌ని అసెంబ్లీకి రావ‌ట్లేదు..

తల వద్ద కాకుండా తోక దగ్గర నీళ్లు తీసుకున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రతి రోజు 13.37 టీఎంసీలు తరలించుకునేలా ప్రాజెక్ట్ లు ఏర్పాటు చేసుకుంద‌ని, తెలంగాణ మాత్రం ప్రతి రోజు 0.25 టీఎంసీ నీళ్ల‌ను కూడా తీసుకోలేకపోతుంద‌న్నారు. పాలమూరు రంగారెడ్డి తాగునీళ్ల ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 7.15 టీఎంసీలకు అనుమతి తీసుకొచ్చింద‌ని, పంపులు, లిఫ్ట్ కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ఈ అనుమతి తెచ్చింద‌ని, 45 టీఎంసీలకు ప్రాజెక్ట్ కు అనుమతి ఇవ్వాలని త‌మ‌ ప్రభుత్వం కోరింద‌ని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకుంటే కేంద్రం ప్రాజెక్ట్ కోసం నిధులు మంజూరు చేస్తుంద‌ని, జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి సోర్స్ శ్రీశైలం కు మార్చడానికి కేసీఆర్ మంత్రి వర్గ ఆమోదం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విషయం బయట పడుతుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేద‌ని, ఈ అంశంపై ప్రభుత్వం విచారణ జరుపుతుంద‌ని అన్నారు. అందుకే హరీష్ రావు బనకచర్లపై మాట్లాడుతున్నార‌ని అన్నారు.

మంత్రి ఉత్త‌మ్ ప‌నితీరు అభినంద‌నీయం..

కేసీఆర్ అసెంబ్లీకి రావాల‌ని, కేసీఆర్ గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వకుండా చూస్తామ‌ని, కేసీఆర్ తన అనుభవాన్ని సభలో పంచుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్, హరీష్ రావు 10 ఏళ్లలో తెలంగాణకు నీళ్ల విషయంలో 100 ఏళ్ల నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కి శాశ్వత జల, రాజకీయ సమాధి కడతారనే విమర్శలు చేస్తున్నార‌న అన్నారు. ఆదిత్య నాథ్ దాస్ ను సలహాదారుగా నియమించడంపై విమర్శలు చేస్తున్నారని, ఆదిత్య నాథ్ దాస్ తెలంగాణ ప్రాజెక్ట్ లపై 10 ఏళ్ళు పని చేశార‌ని, అన్ని ప్రాజెక్ట్ ల‌పై పూర్తి అవగాహన ఉంద‌ని తెలిపారు. ఆయన త‌న‌కు బంధువు కాద‌ని, తమ దొంగతనం బయట పడుతుందనే ఆదిత్య నాథ్ దాస్ పై హరీష్ రావు విమర్శలు చేస్తున్నార‌ని ఆరోపించారు. నదీ జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నార‌ని, ప్రతి కాగితాన్ని అధ్యయనం చేసి తెలంగాణ తర‌పున వాదిస్తున్నార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement