CM Revanth Reddy | సెంట్రలైజ్డ్ కిచెన్లతో రైతులకు ప్రయోజనం కల్పిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు కార్పొరేట్ సంస్థలు చేయూతనందించాయి. విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థలు రూ.22.18 కోట్ల సీఎస్సార్ నిధులను అందించాయి.
- బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు దివీస్, అరబిందో ఫార్మా రూ.22.18 కోట్ల ఎస్సీఆర్ నిధులు
CM Revanth Reddy | ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు కార్పొరేట్ సంస్థలు చేయూతనందించాయి. విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థలు రూ.22.18 కోట్ల సీఎస్సార్ నిధులను అందించాయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ నిర్వహణకు సంబంధించిన నిధులను ఫౌండేషన్‌కు అందజేశారు. అరబిందో ఫార్మా తరఫున రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ తరఫున రూ.12.18 కోట్లు సమకూర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యపై ఆసక్తిని పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానిక రైతులకు కూడా ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనానికి అవసరమైన కూరగాయలు, బియ్యం, ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి సేకరించే విధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించడంతో పాటు, వారికి నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. దీనివల్ల పంట మార్పిడి విధానానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమ కార్యక్రమానికి సీఎస్సార్ నిధులు అందించిన దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. సమాజ అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకమని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ, దివీస్ లేబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!






