త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | ‘రైతు భ‌రోసా’..మ‌రింత ఆల‌స్యం..!

Rythu Bharosa | గ‌త రెండు మూడు రోజులుగా ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న రైతు భ‌రోసా మ‌రింత ఆల‌స్యం కానున్న‌ది. ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించి నిర్ణ‌యం తీసుకునేందుకు మ‌రింత స‌మ‌యం తీసుకోనున్న‌ది.

S

Telangana | Published On Feb 18, 2026, 8.48 pm IST

Rythu Bharosa | ‘రైతు భ‌రోసా’..మ‌రింత ఆల‌స్యం..!
Advertisement

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై తేలాకే నిర్ణ‌యం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌పై
ఎటూ తేల్చుకోలేక‌పోతున్న కాంగ్రెస్ స‌ర్కారు
పెట్టుబ‌డి సాయం అంద‌జేతపై సందిగ్థ‌త‌
ఫిబ్ర‌వ‌రి 25 నుంచి ఏప్రిల్ 16 వ‌ర‌కు
ఇంట‌ర్‌, ప‌ది ప‌రీక్ష‌లు
మే నెల‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్రాథ‌మికంగా నిర్ణ‌యం
ఈ నెల 23న భేటీలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్: గ‌త రెండు మూడు రోజులుగా ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న రైతు భ‌రోసా మ‌రింత ఆల‌స్యం కానున్న‌ది. ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించి నిర్ణ‌యం తీసుకునేందుకు మ‌రింత స‌మ‌యం తీసుకోనున్న‌ది. మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగిసిన‌ త‌ర్వాత‌ రైతు భ‌రోసా అందిస్తామంటూ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్ర‌చారంలో ఫిబ్ర‌వ‌రి 5న మిర్యాల‌గూడ మండ‌లంలోని గూడూరు స‌భ‌లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 1.46 కోట్ల ఎక‌రాల‌కు 9 వేల కోట్ల రూపాయలు అంద‌జేస్తామ‌ని చెప్పారు. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌పై ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో రైతు భ‌రోసా అందించే విష‌య‌మై సందిగ్ధ‌త నెల‌కొన్న‌ది.

మార్చి 31 లోపే నిర్వ‌హించాల‌ని అనుకున్నా

మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో కూడా జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయాలంటే ఎక్కువ ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని రేవంత్ స‌ర్కారు భావిస్తున్న‌ది. పైగా 15వ ఆర్థిక సంఘం గ‌డువు మార్చి 31న ముగుస్తున్న‌ది. ఆలోపు జెడ్పీటీసీ ఎన్నిక‌లు ముగించ‌క‌పోతే ...కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన 498 కోట్లు మురిగిపోయే ప్ర‌మాదం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో 566 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాల‌కు ఆ లోపు ఎన్నిక‌లు ముగించాల‌ని అనుకున్నా..అందుకు ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పెద్ద అడ్డంకిగా మారాయి. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి మార్చి 17 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వ‌ర‌కు ప‌ది ప‌రీక్ష‌లు ఉండ‌డం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు పెద్ద అడ్డంకిగా మారింది. దీనిపై ఈ నెల 23న జ‌రిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఒకవేళ ప్ర‌భుత్వం 498 కోట్లను వ‌దిలేసుకోవాల‌నుకుంటే ప‌రిష‌త్ ఎన్నిక‌లు మే నెల‌లో జ‌రిగే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement